నగరంలో శుక్రవారం అందాల నటి మీనాక్షి చౌదరి సందడి చేసింది. బంజారాహిల్స్లో ఓ చేనేత స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన ఈ అమ్మడు ట్రెడిషనల్ లుక్తో మైమరించింది.
బంజారాహిల్స్, డిసెంబర్ 8: బంజారాహిల్స్ రోడ్ నం:10లోని చిల్లపల్లి వీవర్లీ చేనేత స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి శుక్రవారం సందడి చేశారు.
రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో మనసుకు నచ్చే పట్టు చీరలను, చేనేత చీరలను, వధువుల అందాన్ని రెట్టింపు చేసే పలు రకాల చీరలను అందించడం తమ ప్రత్యేకత అని నిర్వాహకులు తెలిపారు.