పెండ్లి పేరుతో పరిచయాలు..మోసాలు..

సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మ్యాట్రిమోని సైట్లో పరిచయమై..పెండ్లి పేరుతో మాటలు కలిపి, విలువైన బహుతులు పంపిస్తున్నామని, తమను ఎయిర్‌పోర్టులో పట్టుకున్నారంటూ..నటించి.. దోపిడీకి పాల్పడుతున్న నైజీరియన్ సైబర్ ముఠాను రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కథనం ప్రకారం.. కనోన్ ఇవ్రార్డ్, ఎంఎస్ క్యాంటె మారే, సెర్జి ఓలివేర్ ఐవోరి కోస్ట్, ఓలాబి అబిడన్ ఒమ్రిలివ, ఓసాస్ ఫ్రీడోలు నైజీరియాకు చెందిన వాళ్లు. వీరంతా వ్యాపారం, టూరిస్ట్ వీసాలపై భారత్‌కు వచ్చి ఢిల్లీలో ఉంటున్నారు. తమ ఆఫ్రికన్ స్నేహితులతో సైబర్‌నేరాలు ఎలా చేయాలి.. అమాయకులను ఎలా మోసం చేయాలనే అంశాలపై పట్టు సాధించారు.
యూరోపియన్ దేశస్తులుగా చెప్పుకుంటూ.. ఇంటర్నెట్ నుంచి అందమైన అబ్బాయిల ఫొటోలు తీసి.. మ్యాట్రిమోని సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పెండ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ కారణాలు చెప్పి.. బాధితుల వద్ద నుంచి దఫ దఫాలుగా రూ. 23.3 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు.. నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీస్ బృందం సెర్జి ఓలివేర్, ఓలాబి అబిడన్ ఒమ్రిలివ, ఓసాస్ ఫ్రీడోలను అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. ప్రధాన సూత్రధారులైన కనోన్ ఇవ్రార్డ్, ఎంఎస్ క్వాంటెమారేలు పరారీలో ఉన్నారు.
రూ.1.18 లక్షలు …
బాలానగర్, సెప్టెంబర్ 1 : యోనో యాప్ ద్వారా డీటీహెచ్ రీచార్జి చేసినా.. కాకపోవడంతో ఎస్బీఐ కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో వెతికిన కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి ఏపీహెచ్బీకాలనీకి చెందిన ఓ గృహిణిని సైబర్‌నేరగాళ్లు మోసం చేశారు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా టీమ్ వీవర్ డౌన్లోడ్ చేయించి.. రూ.1.18 లక్షలు ఆమె అకౌంట్ నుంచి తస్కరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను..
సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పెండ్లి చేసుకుందాం.. అమెరికాలో సెటిల్ అవుదామంటూ.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతిని సైబర్ నేరగాడు మోసం చేసి.. రూ. 21 లక్షలు వసూలు చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన సదరు బాధితురాలు పెండ్లి కోసం తన ప్రొఫైల్‌ను షాదీ.కామ్‌లో అప్లోడ్ చేసింది. ఆ ప్రొఫైల్ చూసిన పొట్లూరి బాలవంశీకృష్ణ..తాను కూడా సాప్ట్వేర్ ఇంజినీర్‌నంటూ.. పరిచయమయ్యాడు. మాయమాటలతో డబ్బులు వసూలు చేశాడు. బాధితురాలు బుధవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఇటీవల రాచకొండ పోలీసులు ఓ యువతిని మోసం చేసిన కేసులో వంశీకృష్ణను అరెస్ట్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- marriage fraud
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

