వడ్డీ రేటులో తేడా….
వడ్డీ రేటులో తేడా చేసిన ఓ ఫైనాన్స్ సంస్థ చర్యలను వినియోగదారుల కమిషన్ తప్పుపట్టింది. బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. మూసాపేట బాలాజీనగర్‌కు చెందిన యశ్వంత్‌కుమార్ 2018లో ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్‌లో రుణం కోసం దరఖాస్తు
వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన బాధితుడు
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ) : వడ్డీ రేటులో తేడా చేసిన ఓ ఫైనాన్స్ సంస్థ చర్యలను వినియోగదారుల కమిషన్ తప్పుపట్టింది. బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. మూసాపేట బాలాజీనగర్‌కు చెందిన యశ్వంత్‌కుమార్ 2018లో ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత వడ్డీ రేటు 11 నుంచి 11.50 వరకు పడుతుందని, ప్రాసెసింగ్ ఫీజు ఒక్క శాతం తీసుకుంటామన్న ఒప్పందంతో రూ.8లక్షల రుణం మంజూరు చేశారు.
అందుకు గాను బాధితుడు ఈఎంఐలు సైతం క్రమం తప్పకుండా కడుతున్నాడు. కాగా, కొద్ది కాలానికి ఫైనాన్స్ సంస్థ నుంచి ఈ- మెయిల్ వచ్చింది. అందులో వడ్డీరేటు 13.25 శాతం, ప్రాసెసింగ్ ఫీజు కింద 2 శాతం మినహాయించుకుంటున్నట్లు ఉంది. దీంతో తనకు చెప్పింది ఒకటి, వడ్డీ రేటు విధించింది మరొకటని నిర్ధారించుకున్నాడు. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరాడు. విచారణ జరిపిన కమిషన్ అధ్యక్షులు బి. ఉమా వెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి. లక్ష్మి ప్రసన్నతో కూడిన బెంచ్ బాధితుడికి రూ.5వేల నష్టపరిహారంతో పాటు మరో రూ.5వేలు ఖర్చు కింద ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

