అనుమానాస్పద స్థితిలో మాజీ ఎంపీ కుమారుడు మృతి

బంజారాహిల్స్, జూన్ 1 : ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి అలియాస్ రవీంద్ర (32) బంజారాహిల్స్‌లోని ఓ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మద్యానికి బానిసైన రవీంద్ర కొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్నాడు. తాగుడు మాన్పించేందుకు అతన్ని నగరంలోని ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించారు. కాగా.. గత నెల 28న అక్కడి నుంచి బయటకు వచ్చిన రవీంద్ర బంజారాహిల్స్‌లోని ఓ హోటలో గది తీసుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆ గదిలో విగత జీవిగా పడి ఉండటాన్ని హోటల్ సిబ్బంది గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రవీంద్ర రక్తం వాంతులు చేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా దవాఖాన మార్చూరీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- maganti babu
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

