ఆర్కేపురం, సెప్టెంబర్ 28 : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా-2025 9వ లక్కీ డ్రా కార్యక్రమం ఆదివారం కొత్తపేటలోని స్వర్ణమాల జ్యువెలర్స్, వామిక సిల్క్స్ లో నిర్వహించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా కస్టమర్లను మరింత ఉత్సాహ పర్చేందుకు లక్కీడ్రా బంపర్ ఆఫర్‌ను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే అందుబాటులోకి తెచ్చాయి.
స్వర్ణమాల జ్యువెలర్స్ డైరెక్టర్ బొగ్గారపు శరత్, వామిక సిల్క్స్ షాపింగ్ అధినేత ఓరుగంటి సుధాకర్, ఏడీవీటీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి, నమస్తే తెలంగాణ యాడ్ మేనేజర్ సురేందర్‌రెడ్డి కలిసి లక్కీ డ్రాను తీశారు. మొదటి బహుమతి శ్రీవాణి( కూపన్ నంబర్ 037543), రెండో బహుమతి శంకర్ (కూపన్ నంబర్ 015225), మూడో బహుమతి శ్రీకాంత్‌రెడ్డి (కూపన్ నంబర్ 037792), నాల్గో బహుమతి శివశంకర్ (కూపన్ నంబర్ 041639) గెల్చుకున్నారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనంజాకు టైటిల్ స్పాన్సర్‌గా సీఎంఆర్ షాపింగ్ మాల్, మెయిన్ స్పాన్సర్‌గా అల్లకాస్, గిఫ్ట్ స్పాన్సర్‌గా బిగ్‌సీ, పవర్డ్ బై ఆల్మండ్ హైజ్, ప్రోటీన్ పార్ట్నర్గా వెన్‌కాబ్ ప్రెష్ చికెన్, ఇతర స్పాన్సర్లుగా హర్షా టొయాటా, కున్ హుందాయ్, వరుణ్ మోటార్స్, మానేపల్లి జ్యువెలర్స్ , శ్రీ సిల్క్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెలివిజన్ పార్ట్నర్గా టీ న్యూస్, డిజిటల్ పార్ట్నర్గా సుమన్ టీవీ వ్యవహరిస్తున్నాయి.
వినియోగదారులకు మేలుచేసే బొనాంజా
సరైన సమయంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల వ్యాపార సంస్థలకు ఎంతో మేలు కలుగుతుంది. వినియోగదారులకు లాభం చేసే బొనాంజా ఇది. ప్రస్తుతం తగ్గిన జీఎస్టీ వలన కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. బంగారం కొనుగోలు చేయాలనుకున్న వినియోగదారులు నాణ్యతకు ప్రాధాన్యనిచ్చి స్వర్ణమాల జ్యువెలర్స్ కొనుగోలు చేయడం సంతోషాన్చిచ్చింది.
– బొగ్గారపు శరత్, స్వర్ణమాల జ్యువెలర్స్ డైరెక్టర్
కొనుగోలుదారుల్లో రెట్టింపు ఉత్సాహం
దసరా బొనాంజా ద్వారా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే కస్లమర్లకు బహుమతులు అందించడం అభినందనీయం. న్యాయబద్ధంగా లక్కీడ్రాలు తీసి విజేతలైన వారికి బహుమతులను అందించడం ద్వారా కొనుగోలుదారుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. వామిక సిల్క్స్లో వెయ్యి రూపాయల షాపింగ్గాను ఒక గ్రామ్ సిల్వర్, కూపన్ అందజేస్తున్నాం. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ఓరుగంటి సుధాకర్, వామిక సిల్క్ అధినేత