యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు
నా అన్వేషణ ఫేమ్, యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా హిందూ దేవతలపై అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, భక్తుల మనోభావాలు దెబ్బతీశాడని గతేడాది డిసెంబర్లో సినీ నటి కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా 352, 79, 299 బీఎన్ఎస్, సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఖైరతాబాద్, ఫిబ్రవరి 25 : నా అన్వేషణ ఫేమ్, యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా హిందూ దేవతలపై అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, భక్తుల మనోభావాలు దెబ్బతీశాడని గతేడాది డిసెంబర్లో సినీ నటి కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా 352, 79, 299 బీఎన్ఎస్, సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
తాజాగా ఈ ఏడాది జనవరి 4న అన్వేష్‌పై అదనంగా సెక్షన్ 69 ఏ బీఎన్ఎస్ ద్వారా అతని యూట్యూబ్ చానెల్‌ను బ్లాక్ చేయాలని, అతని ఖాతాలను ఫ్రీజ్ చేసేందుకు సెక్షన్ 106 నమోదు చేయాలని మరో సారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశాఖపట్నంకు చెందిన అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో బుధవారం లుకౌట్ నోటీసును జారీ చేశారు. తద్వారా స్వదేశానికి రాగానే అరెస్టు చేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా విమానాశ్రయంలోనే అన్వేషన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

