అన్నీ అబద్ధాలే..!

- సాకులు చెబుతూ.. రోడ్లపైకి..
- చలాన్లు విధిస్తున్నా.. మారని జనం
- కొందరి నిర్లక్ష్యం.. ఇతరులకు శాపం
- బాధ్యతగా ఉంటేనే.. కరోనా కట్టడి
- ఆత్మప్రమాణం చేసుకుంటేనే.. అందరూ సేఫ్
నగర శివారు నుంచి ఓ యువకుడు ఉదయం 10.45 గంటలకు బైక్‌పై సిటీకి వస్తున్నాడు.. చెక్‌పాయింట్ వద్ద పోలీసులు అతన్ని ఆపారు.. సార్.. మా ఇంట్లోవారికి అర్జంట్‌గా మందులు అవసరం ఉన్నాయి.. మా వద్ద దొరకడంలేదు.. అందుకే సిటీకి వెళ్తున్నానన్నాడు. ఇందుకు ఓ మందుల చిటీని చూపించాడు.. నిజంగానే అనుకున్న పోలీసులు అతన్ని వదిలేశారు.. దీంతో అతను పలు ప్రాంతాల్లో చక్కర్లు కొట్టి ఇంటికి వెళ్లాడు.. స్నేహితులతో పోలీసులకు మాటలు చెప్పి తిరిగి వచ్చానంటూ గొప్పలు చెప్పుకున్నాడు.. ఇది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్నది.
- ఉదయం 11.30 గంటలకు ఓ యువతి చెక్ పోస్ట్ వద్దకు వచ్చింది. పోలీసులు ఆపి.. ఈ సమయంలో ఎందుకు వచ్చావంటూ అడిగారు.. ఫ్రెండ్‌ను కలువడానికి వెళ్తున్నాను.. వెంటనే తిరిగి వస్తానంటూ చెప్పింది.. దీంతో ఆమెను వెనక్కి పంపించారు. ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగింది.
- మధ్యాహ్నం 12.30గంటలకు.. ఓ వ్యక్తి కారులో బయటికి వచ్చాడు. విధుల్లో ఉన్న పోలీసులు అతడిని ఆపి.. లాక్డౌన్ సమయంలో బయటకు ఎందుకు వచ్చారని అడిగారు.. ఇంట్లో ఎవరూ లేరు.. మందుల కోసం వచ్చాను.. వెంటనే వెళ్లిపోతానన్నాడు.. పోలీసులు నిజంగానే అనుకుని అతడిని వదిలేశారు.. ఈ ఘటన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగింది.
- ఇలా.. కొంతమంది అనవసరంగా బయటకు వచ్చి.. పోలీసులకు కుంటిసాకులు చెబుతూ లాక్డౌన్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు.. ఒకవైపు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడానికి మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 20వేల పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలను కాపాడేందుకు రోడ్లపై 24/7 ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. అలాంటివారికి కొందరు కుంటిసాకులు, అబద్ధాలు చెబుతూ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి సమయంలో నిజాయితీ, బాధ్యతగా ఉండాలి.. కానీ పోలీసులకు అబద్ధాలు చెప్పి.. బయట తిరిగిరావడం గొప్ప కాదని నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు గుర్తుపెట్టుకోవాలని పలువురు సూచిస్తున్నారు..
రక్షణ చర్యలను కాలరాస్తున్నారు..
అటు ప్రభుత్వం.. ఇటు పోలీసులు మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికి నిరంతరం రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అయితే .. కొందరు చేసే తప్పిదాలు.. మిగతా వారికి శాపంగా మారే అవకాశం ఉంది. ఒక వైపు పోలీసులు నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటుండగా.. మరోవైపు కొందరు వైరస్‌ను మరింత వ్యాప్తిచేసేలా రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు.. ప్రభుత్వం, పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ఎంత మొత్తుకుంటున్నా.. చాలా మంది మాకేమి కాదు… మేం ధృడంగా ఉన్నాం అనే భావనతో తప్పులు చేస్తూ.. ఇతరులకు వైరస్‌ను వ్యాపింపచేస్తున్నారు..
కొందరి తప్పులు.. ఇతరులకు శాపం
చాలామంది మిడిమిడి జ్ఞానంతో చేస్తున్న తప్పులు అనర్థాలకు దారి తీస్తుందని అర్థం చేసుకోవడం లేదు. పోలీసులను, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే వారికే నష్టం అని ఆలోచించాలి. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది చెప్పే సాకులు బాధ కలిగిస్తున్నదని పలువురు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయినా పోలీసులు చట్టపరంగా తమ విధుల్లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 20వేలకు పైగా చలాన్లు జారీ చేశారు. కాబట్టి సాకులు వద్దు, బాధ్యతగా వ్యవహరిద్దాం. మహమ్మారిని బంధించేందుకు బాధ్యతయుతంగా వ్యవహరిద్దామని ప్రతి ఒక్కరూ.. వారికి వారు ఆత్మ ప్రమాణం చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. కొద్ది మంది నిర్లక్ష్యం కారణంగా అందరికీ శాపంగా మారొద్దని కోరుతున్నారు.
నిబంధనలు పాటించాల్సిందే.. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్
సిటీబ్యూరో, మే 16(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. కరోనా చైన్ లింక్‌ను తెగొట్టాలంటే లాక్డౌన్ తప్పని సరి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరుతున్నారు. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతించాలని ఆయా పోలీస్ చెక్‌పోస్టుల ఇన్చార్జిలకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అదేశాలు జారీ చేశారు. నిత్యావసర వస్తువుల రవాణాకు ఏదైనా ఇబ్బంది ఏర్పడితే 9490616012కు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. లాక్డౌన్ నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు సోషల్‌మీడియా ద్వారా అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు జరిమానాలు విధిస్తున్నారని.. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

