మద్యం మత్తులో చిందేశారు..

- లాక్డౌన్ నిబంధనలు పాటించని ఐటీ ఉద్యోగులు
- బర్త్‌డే పార్టీలో పాల్గొని పోలీసులకు దొరికిపోయారు
సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం విధించిన నిబంధనలకు విరుద్ధంగా జరుపుకున్న బర్త్‌డే పార్టీ.. 60 మందిని అడ్డంగా బుక్ చేసింది . అర్ధరాత్రి మద్యం జోష్‌లో మ్యూజిక్కు చిందేసిన వారందరీ నషా దించేలా సైబరాబాద్ పోలీసులు చట్టపరంగా చర్యలకు దిగారు. హైదరాబాద్ శివారు కడ్తాల్‌లోని బాక్స్ ఫాంహౌజ్‌లో జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న 60 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరందరిపై లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలను మోపారు.
వీరందరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు. పార్టీకి హాజరైన వారంతా ఐటీ ఉద్యోగులే.. కాగా పోలీసులు ఈ 60 మంది పనిచేస్తున్న కంపెనీలకు లేఖలు రాసి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వైనంపై వివరించనున్నారు. దీంతో వారి వ్యక్తిగత ప్రవర్తనపై రీమార్క్ ఏర్పడనుంది. ఈ విధంగా ప్రభుత్వ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనలో సైబరాబాద్ పోలీసులు నిర్వాహకులైన భరత్, జీషాన్, అన్వేష్‌లను ఆదివారం అరెస్ట్ చేయగా.. బర్త్‌డే బాయ్ వరుణ్‌గౌడ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- lock down rules
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

