బిల్లులు రాకుంటే బతికేదెట్లా..?
జీహెచ్ఎంసీ ఎదుట బల్దియా కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. గురువారం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కాంట్రాక్టర్లంతా బైఠాయించి రూ.1500కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘వీ వాంట్ పేమెంట్స్' అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎవరినీ కష్టపెట్టడం మా ఉద్దేశం కాదు.. బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి, చేసిన పనులకు బిల్లులు రాక ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుని బతుకలేని పరిస్థితిలో ఉన్నాం’ అంటూ కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
- బల్దియాలో కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా
- రూ.1500 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళన
- ఇద్దరు కాంట్రాక్టర్ల ఆత్మహత్యాయత్నం ఆందోళన ఉధృతితో స్పందించిన కమిషనర్
- చర్చల అనంతరం.. వచ్చే జూన్ నాటికల్లా రూ. 400 కోట్లు ఇస్తామని హామీ
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎదుట బల్దియా కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. గురువారం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కాంట్రాక్టర్లంతా బైఠాయించి రూ.1500కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘వీ వాంట్ పేమెంట్స్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎవరినీ కష్టపెట్టడం మా ఉద్దేశం కాదు.. బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి, చేసిన పనులకు బిల్లులు రాక ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుని బతుకలేని పరిస్థితిలో ఉన్నాం’ అంటూ కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇద్దరు కాంట్రాక్టర్లు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న సహచర కాంట్రాక్టర్లు ఆ ఇద్దరి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏడాది కాలంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల బాధతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బల్దియా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రామకృష్ణారెడ్డి, సురేందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులకు డబ్బులు లేక, వర్కర్లకు ఈపీఎఫ్, బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేకపోతున్నామని, ఆర్థిక బాధలతో సడెన్ స్ట్రోక్‌లకు గురై ప్రాణాలు పోతున్న పరిస్థితులు వచ్చాయని వాపోయారు. తమ బకాయిలు చెల్లిస్తేనే పనులు జరుపుతామని, రానున్న రోజుల్లో నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కమిషనర్ హామీతో..
బల్దియా కాంట్రాక్టర్ల ఆందోళనపై కమిషనర్ ఇలంబర్తి స్పందించి వారితో చర్చలు జరిపారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొన్న సమస్యలపై ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏడాది కాలంగా బకాయిలు చెల్లించడం లేదని, రూ.1500 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ వచ్చే జూన్ నాటికల్లా రూ. 400కోట్ల మేర బకాయిలు చెల్లిస్తామని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. దీంతో కాంట్రాక్టర్లు ఆందోళన విరమించారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

