కోఠి సుల్తాన్ బజార్లోని మెడికల్ షాపులపై దాడులు
మెడికల్ షాపులపై దాడులు | కోఠి సుల్తాన్ బజార్లోని ఇంద్రబాగ్లో ఉన్న హోల్సేల్ మెడికల్ షాపులపై లీగల్ అండ్ మెటలర్జీ డిపార్ట్మెంట్ అధికారులు శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు

హైదరాబాద్ : కోఠి సుల్తాన్ బజార్లోని ఇంద్రబాగ్లో ఉన్న హోల్సేల్ మెడికల్ షాపులపై లీగల్ అండ్ మెటలర్జీ డిపార్ట్మెంట్ అధికారులు శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రోగులను ఆసరాగా చేసుకున్న మెడికల్ వ్యాపారస్తులు.. అడ్డగోలుగా ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించినట్లు లీగల్ అండ్ మెటలర్జీ అధికారులు మీడియాకు వెల్లడించారు. మాస్కులు, శానిటైజర్లపై ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తున్న మెడికల్ వ్యాపారస్తులకు జరిమానాలు విధించామని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేని మందులు, ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ…వ్యాపార సముదాయాలను కొనసాగించాలన్న ప్రభుత్వ నిబంధనలను సుల్తాన్ బజార్ ఇంద్రబాగ్లోని మెడికల్ షాపుల యజమానులు పాటించడం లేదు. భౌతిక దూరం పాటించుకుండా విక్రయాలు జరుపుతున్నారు. మాస్కులు ధరించకుండా మార్కెట్కు వస్తున్న వారికి పోలీసులు చలాన్లు విధిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

