కేవైసీ లింక్ ప్రెస్ చేస్తే డబ్బులు మాయం

అంబర్‌పేట, ఆగస్టు 2 : మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి.. కేవైసీ లింక్‌పై ప్రెస్ చేయండని ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను చూసి లింక్‌పై ప్రెస్ చేసిన ఓ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమైన ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మాకాలనీలో నివాసముండే బజార్ మహేంద్ర ప్రైవేట్ ఉద్యోగి. అతనికి విద్యానగర్‌లోని ఎస్బీఐ బ్యాం కులో సేవింగ్ అకౌంట్ ఉంది. సోమవారం మధ్యాహ్నం అతని అకౌంట్‌కు రూ. 8,800 క్రెడిట్ అయ్యాయని మెసేజ్ వచ్చింది. దాని కేవైసీ లింక్ పై వెంటనే ప్రెస్ చేయండని మరో మెసేజ్ వచ్చింది. అది చూసుకున్న మహేంద్ర ఆ లింక్‌పై ప్రెస్ చేశాడు. వెంటనే అతని అకౌంట్ నుంచి రూ.8,800 మాయమయ్యాయి. అతని అకౌంట్లో రూ.8800 క్రెడిట్ అయ్యాయని వచ్చిన మెసేజ్ తప్పని, తాను మోసపోయానని గ్రహించి వెంటనే బ్యాంకుకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియ జేశాడు. బ్యాంక్ వాళ్లు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించా రు. అనంతరం ఆయన నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- kyc fraud
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

