రెండేండ్ల తర్వాత మేమే వస్తాం.. అందరి లెక్క తేలుస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల దౌర్జన్యాలతో బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని, రెండేండ్ల తర్వాత మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు ప్రతి ఒకరి లెక తేలుస్తామని తలసాని హెచ్చరించారు.
- పోలీసుల దౌర్జన్యాలతో బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు
- మూడేండ్లలో రేవంత్‌రెడ్డి సొంతంగా కట్టిన భవనం ఒకటైనా ఉందా?
- పాలనను గాలికి వదిలేసి ఢిల్లీ, కేరళ, లండన్ అంటూ విమానాల్లో చకర్లు
- రేవంత్‌రెడ్డి సర్కార్‌పై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం
- కేటీఆర్ సమక్షంలో ఖైరతాబాద్ మైనార్టీ నేత బిబ్రాన్ షరీఫ్ చేరిక
సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల దౌర్జన్యాలతో బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని, రెండేండ్ల తర్వాత మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు ప్రతి ఒకరి లెక తేలుస్తామని తలసాని హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు జిబ్రాన్ షరీఫ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు
ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు మాట్లాడారు. కేసీఆర్ నిర్మించిన కొత్త సచివాలయాన్ని చూసి ప్రపంచమంతా అభినందిస్తుంటే రేవంత్ రెడ్డికి మాత్రం అది నచ్చకపోవడం విడ్డూరంగా ఉందని తలసాని పేర్కొన్నారు. పకనే ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుని కేసీఆర్‌ను తిట్టడానికి రేవంత్‌కు సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. ‘ఈ మూడేండ్ల కాలంలో రేవంత్ రెడ్డి సొంతంగా కట్టిన భవనం ఒకటైనా ఉందా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమైన ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసి, రిబ్బన్లు కట్ తానే కట్టానని చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుకొంటున్నారన్నారు
సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం కేసీఆర్ హయాంలోనే 80 శాతం పూర్తయిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ఇకడ పాలనను గాలికి వదిలేసి ఢిల్లీ, కేరళ, లండన్ అంటూ విమానాల్లో చకర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీలోకి చేరిన జిబ్రాన్ షరీఫ్ కు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజల్లో మమేకమై పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
మైనార్టీలకు కాంగ్రెస్ ద్రోహం : మాజీ మంత్రి మహమూద్ అలీ
రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని, మత సామరస్యానికి తీవ్ర విఘాతం కలిగిందని మాజీ మంత్రి మహమూద్ అలీ ధ్వజమెత్తారు. రాష్టంలో మైనార్జీలు, ఇతర వర్గాల సంక్షేమానికి కట్టుబడిన అసలు సిసలు సెక్యూలర్ పార్టీ ఒక బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మైనార్టీలకు ఇచ్చిన హామీలలో ఏ ఒకటినీ నేటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రజల్లో ఎవరిని కదిలించినా మళ్లీ కేసీఆరే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, రెండేండ్ల తర్వాత రాష్ట్రంలో ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందన్నారు.
మైనార్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల సంఖ్యను పెంచి లక్షలాది మందికి నాణ్యమైన ఉచిత విద్య అందించిన ఘనత కేసీఆర్‌కే దకుతుందన్నారు. యువతలో కేటీఆర్‌కు ఉన్న క్రేజ్ మరో నాయకుడికి లేదని, అన్ని వర్గాల ఆదరణ ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేరొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక ప్రతిపక్షాలపై బూతులతో విరుచుకుపడటం తప్ప.. మరేమీ తెలియడం లేదని మహమూద్ అలీ విమర్శించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

