కార్ఖానా పోలీసుల ఔదార్యం

అర్ధరాత్రి సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళ ఆస్పత్రికి తరలింపు
కంటోన్మెంట్, ఆగస్టు 17: పోలీసులు కరుణలో కూడా తమకు తామే చాటి అని నిరూపించుకున్నారు. ఓ గర్భిణికి అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో కార్ఖానా పీఎస్ బ్లూ కోట్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. సిఖ్ విలేజ్ శ్రీరామ్‌నగర్ బస్తీకి చెందిన బబితకు ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నొప్పులు రావడంతో కుటుంబీకులు కార్ఖానా సీఐ రవీందర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సీఐ వెంటనే బ్లూకోట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. బ్లూ కోట్ సిబ్బంది సతీశ్, రమేశ్ హుటాహుటిన బబితను ఆటోలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం బబిత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో తల్లీ కూతురు క్షేమంగా ఉన్నారు. వెంటనే స్పందించిన పోలీసులకు బబిత కుటుంబసభ్యులు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. బ్లూకోట్ సిబ్బందిని సీఐ రవీందర్ అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Karkhana police
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

