ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం పట్టుకున్నారు. రూ. లక్ష నగదు తీసుకుంటుండగా, ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ జోన్, బోరబండ సరిల్-37 డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో శ్రీలత జూనియర్ అసిస్టెంట్ (రెవెన్యూ/టాక్స్)గా పనిచేస్తున్నారు.
సిటీబ్యూరో: ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం పట్టుకున్నారు. రూ. లక్ష నగదు తీసుకుంటుండగా, ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ జోన్, బోరబండ సరిల్-37 డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో శ్రీలత జూనియర్ అసిస్టెంట్ (రెవెన్యూ/టాక్స్)గా పనిచేస్తున్నారు.
ఓ ఫిర్యాదుదారుడు తన ఇంటి నిర్మాణ అనుమతికి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైలును ప్రాసెస్ చేసి అనుమతి పత్రాలు అందజేయడానికి శ్రీలత రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని బాధితుడు వాపోవడంతో, తొలి విడతగా రూ. లక్ష ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ సమీపంలోని రత్నదీప్ సూపర్ మారెట్ వద్ద శ్రీలత ఆ నగదును తీసుకుంటుండగా, ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు పట్టుకున్నారు. ఆమె నుంచి నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు.. అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meenakshi Chaudhary | పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. !
INDIA alliance | డీలిమిటేషన్ బిల్లు వేళ కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం.. స్టాలిన్, పవార్‌తో చర్చించనున్న ఇండియా కూటమి నేతలు
US Accident | అమెరికాలో ప్రమాదం.. జలపాతంలో పడి టీడీపీ నేత కుమారుడి మృతి
Nani | నాని కోసం గొడుగు పట్టిన నితిన్.. ‘అలియాస్ రుక్మిణీ’ ఈవెంట్లో బయటపడిన పాత సీక్రెట్!
AR Rahman | ‘రాక్‌స్టార్’ పాటలు నచ్చలేదని 8 నెలలు రెమ్యూనరేషన్ ఆపేశారు : ఏఆర్ రెహమాన్ !
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

