కేపీహెచ్బీలో …‘జంగిల్’ పార్కు

- రూ.25 లక్షలతో అడవి వాతావరణం సృష్టి
- చిన్నారులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు
కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 12 : ప్రపంచంలోనే ప్రసిద్దిగాంచిన.. చిన్నారులను అమితంగా ఆకట్టుకున్న సిసి మా ది జంగిల్‌బుక్. ఈ సినిమాలో ఓ బాలుడు అడవిలో సింహం, ఎలుగుబంటి, తోడేళ్లు వంటి జంతువుల మధ్య కలిసి జీవిస్తుంటాడు. ఆ బాలుడి ఆటపాటలే అడవిలోని జంతువుల విన్యాసాలను చూసి చిన్నారులు చప్పట్లు కొడుతూ వింత అనుభూతిని పొందుతారు. మరలామరలా ఇదే సినిమాను చూడడం.. ఇదే తరహా సినిమాలు చూడడానికి చిన్నారులు అమితంగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మహానగరంలో పుట్టిపెరిగి కాన్వెంట్, కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న చిన్నారులకు అడవి అంటేనే తెలియని పరిస్థితులున్నాయి.
అడవిలో నివసించే జంతువులు, పక్షులు, పాములు, ఇతర జీవరాసులు… అక్కడక్కడా కనిపించే గుహల గురించి పుస్తకాలు, సినిమాల ద్వారా తెలుసుకోవడమే తప్పా వాటిని నిజంగా వీక్షించే పరిస్థితులే లేకుండా పోయాయి. నగరంలో నివసించే చిన్నారులకు సైతం జంగిల్‌బుక్ సినిమా తరహాలో అడవి అనుభూతులను అందించేందుకు ప్రత్యేకంగా పార్కును సిద్ధ్దం చేస్తున్నారు. జంగిల్‌బుక్ సినిమా థీమ్‌తో మూసాపేట సర్కిల్లో విభిన్నమైన పార్కును అందుబాటులోకి తెస్తున్నారు.
అడవి అనుభూతిని పొందేలా…
నగరంలోని చిన్నారులు అడవి అనుభూతిని పొందే లా ఆహ్లాదకరమైన పార్కును సృష్టిస్తున్నారు. కేపీహెచ్‌బీ కాలనీ 15వ ఫేజ్‌లో అభివృద్ధికి నోచుకోని 2000 గజాల పార్కు స్థలాన్ని జంగిల్ థీమ్‌తో అభివృద్ధి చేస్తున్నారు. రూ.25 లక్షల నిధులను ఖర్చు చేస్తూ అడవిని తలపించేలా విభిన్నమైన పార్కును తీర్చిదిద్దుతున్నారు. ఈ పార్కు ముఖద్వారాన్నే అడవిలోని గుహలాగా తీర్చిదిద్దుతారు. లోపలికి వెళ్లగానే పెద్ద మర్రిచెట్టు దాని ఊడలు కనిపిస్తాయి. అడవిలో కనిపించే సింహం (లయన్), ఎలుగుబంటు (బీర్), కొండచిలువలు కనిపిస్తాయి. చెట్టుపై వేలాడుతున్నట్లుగా పాముల బొమ్మలు కనిపిస్తాయి. మర్రిచెట్టు ఊడల మాదిరిగా ఉండే జారుడుబండపై పిల్లలు ఆడుకునేలా ఏర్పాట్లు చేస్తారు. పార్కు ఆవరణంతా పచ్చని చెట్లు, గార్డెనింగ్‌తో అడవిని తలపించేలా ఏర్పాటు చేస్తారు. ఓవైపు సెల్ఫీ పాయింట్‌ను తీర్చిదిద్దడం మరోవైపు కెఫ్టెరియాను అందుబాటులోకి తెస్తారు. పార్కులో చెట్ల మొద్దులను తలపించేలా బెంచీలను అందుబాటులో ఉంచుతారు. పార్కు చుట్టూరా వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. చిన్నారులు, తల్లిదండ్రులు, తాతమ్మలతో కలిసివచ్చే కుటుంబమంతా సేదతీరి కాలక్షేపం చేసేలా తీర్చిదిద్దనున్నారు.
ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం…
కేపీహెచ్‌బీ కాలనీ 15వ ఫేజ్‌లో పార్కు కోసం వదిలిన ఖాళీ స్థలాన్ని జంగిల్ థీమ్‌తో అభివృద్ధి చేయడం జరుగుతుంది. నగరంలో ఎక్కడా లేనివిధంగా అడవిని తలపించేలా పార్కును తీర్చిదిద్దుతు న్నాం. జంగిల్‌బుక్ సినిమాలో కనిపించే మర్రిచెట్టు, సింహం, ఎలుగుబంటు లాంటి ఆకారాలను సిద్ధ్దం చేస్తున్నాం. ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ పార్కులో చిన్నారులు ఆటపాటలతో తన్మయత్వం పొందుతారు. మరో నెలరోజుల్లో పార్కు పనులను పూర్తిచేసి అందుబాటులోకి తెస్తాం. – వి.మమత, జడ్సీ, కూకట్పల్లి జోన్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

