జూనియర్ ఎన్టీఆర్ గ్యారేజీలో మరో కొత్త కారు కొలువుదీరింది. త్వరలో తనకిష్టమైన లుంబోర్ఘిని ఊరుస్లో ఆయన చక్కర్లు కొట్టనున్నారు. అయితే తాజాగా నందమూరి తారకరామారావు బుధవారం వాహన ఆన్లైన్ ఫ్యాన్సీ నంబర్ల వేలంలో పాల్గొని రూ.17 లక్షలు వెచ్చించి టీఎస్09ఎఫ్ఎస్9999 నంబర్‌ను దక్కించుకున్నారు. రవాణా చరిత్రలోనే ఇంత ఎక్కువ మొత్తంతో నంబర్‌ను దక్కించుకున్న ఏకైక వ్యక్తిగా ఎన్టీఆర్ రికార్డు నెలకొల్పారు. గతంలో రూ.12 లక్షలతో ఓ వ్యాపారవేత్త ఫ్యాన్సీ నంబర్‌ను కైవసం చేసుకుని రికార్డు సాధించగా.. ఆ వ్యక్తిని వెనక్కి నెట్టి జూనియర్ ఎన్టీఆర్ తన కారు ఫ్యాన్సీ నంబర్‌కు ఏకంగా రూ.17లక్షలు వెచ్చించారు. మరో నంబర్ టీఎస్09ఎఫ్టీ0001ను లహరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.7.1లక్షలతో కైవసం చేసుకుంది. ఇదే వరుసలో మరో ఫ్యాన్సీ నంబర్ టీఎస్09ఎఫ్టీ0009 రతన్ నల్ల అనే వ్యక్తి రూ.3.76 లక్షలకు దక్కించుకున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో జరిగిన ఈ వేలం ద్వారా బుధవారం ఒక్కరోజే రూ.46 లక్షల ఆదాయం రవాణాశాఖకు సమకూరింది.