రేపు పలు ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళా

సుల్తాన్‌బజార్,ఆగస్టు 3: నిరుద్యోగ యువతీ,యువకులకు ప్రైవేట్ రంగాల్లో ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా ఈనెల 5న జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.నగరంలోని ప్రముఖ సంస్థలైన పేటీఎం,కొంపల్లి డాటా సొల్యూషన్స్‌లో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్,రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్,మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితర ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.18 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు,పదో తరగతి,ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ మల్లేపల్లి ఐటీఐ ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూల కోసం ఉదయం 11గంటలకు హాజరు కావాలని కోరారు.సమాచారం కోసం యంగ్ ప్రొఫెషనల్ టి రఘుపతి-8247656356 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- job mela 2021
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

