ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ జలమండలి మేనేజర్ స్ఫూర్తిరెడ్డి
ACB Raid | మణికొండ మున్సిపాలిటీ జలమండలి మేనేజర్ లంచం తీసుకుంటూ పట్టుబడింది.
మణికొండ : మణికొండ మున్సిపాలిటీ జలమండలి మేనేజర్(Jalamandali Manager) లంచం తీసుకుంటూ పట్టుబడింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ద్వారా రూ. 30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB Officials) రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు డివిజన్-18 మణికొండ మేనేజర్‌గా స్ఫూర్తిరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు.
మణికొండ మున్సిపాలిటీ (Manikonda Muncipality) నెక్నాంపూర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్‌రెడ్డి కొత్తగా భవనాన్ని నిర్మించుకున్నాడు. ఈ భవనానికి రెండు కొత్త నీటి కనెక్షన్లు(Tap Connections) తీసుకునేందుకు అధికారులను కోరాడు. దీంతో మేనేజర్ స్పూర్తిరెడ్డి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్ ద్వారా సదరు వ్యక్తి నుంచి రూ. 30 వేల లంచం డిమాండ్ చేశారు. అన్ని దస్తావేజులు సరిగ్గా ఉన్నా కనెక్షన్ ఎందుకు ఇవ్వరని బాధితుడు ప్రశ్నించాడు. డబ్బులు ఇస్తేనే నీటి కనెక్షన్‌కు అనుమతులు ఇస్తామని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
మంగళవారం జలమండలి మేనేజర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రూ. 30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులోఎదుట హాజరుపరిచామన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motivational Story | పొలంలో ముల్లు గుచ్చుకుంటే ఆగలేదు.. అడవిలో పాములను చూసి ఎందుకు భయపడ్డాడు?.
Ant Story | ఓ చిన్న చీమ చెప్పిన గొప్ప జీవిత పాఠం.. ఖురాన్లో ప్రస్తావించిన అద్భుత కథ
Karthika Masam | కార్తిక మాసాన్ని హరిహర మాసం అని ఎందుకంటారు? దీపారాధన నుంచి తులసీ పూజ వరకు ప్రతి ఆచారం వెనుక ఉన్న రహస్యం ఇదే!
Bigg Boss 10 | హైపర్ ఆది పంచులతో హౌస్‌లో నవ్వుల సందడి.. శ్వేత ఎలిమినేట్,అమన్ ఎమోషనల్!
SIR Voter List | ఓటర్లకు ఈసీ భారీ ఊరట.. ఫామ్-6 దాఖలు చేస్తే కేసులు పెట్టరు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

