పెట్టుబడిపై 30శాతం లాభమంటూ బోల్తా

సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): ఇన్వెస్ట్మెంట్ యాప్‌లో పెట్టుబడి పెట్టిన నగరానికి చెందిన ఓ వ్యక్తి.. సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.1.3లక్షలు పోగొట్టుకున్నాడు.. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లాలాగూడకు చెందిన ఎజాజ్ పాషాకు.. ఇన్వెస్ట్మెంట్ యాప్‌లో పెట్టుబడి పెడితే.. రోజుకు పెట్టిన పెట్టుబడిపై 30 శాతం లాభాలిస్తున్నారని.. స్నేహితుడు చెప్పాడు. దీంతో అతను ఇజెడ్ప్లాన్స్ పేరుతో ఉన్న యాప్‌లో ముందుగా రూ. 5 వేలు పెట్టుబడి పెట్టగా.. లాభాలు ఇచ్చారు.. ఆ తర్వాత రూ. 25 వేలు పెట్టగా లాభం వచ్చింది. అంతటితో ఆగకుండా ఏకంగా లక్ష రూపాయలకుపైగా పెట్టుబడి పెట్టడంతో ఆ యాప్ బిచాణా ఎత్తేసింది. మోసపోయానని గుర్తించిన బాధితుడు బుధవారం సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
- గన్‌ఫౌండ్రీకి చెందిన సాగర్.. ఓఎల్ఎక్స్లో సెకెండ్ హ్యాండ్ బైక్‌ను రూ. 25 వేలకు కొనేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అమ్మేవాళ్లు తాము ఆర్మీ అధికారులమంటూ నమ్మించి.. వివిధ చార్జీల పేరుతో రూ. 1.11 లక్షలు కాజేశారు.
- నకిలీ ఇన్స్టాగ్రామ్ ఐడీని తయారు చేసి, మార్ఫింగ్ ఫొటోలతో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఓ మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కంపెనీ మెయిల్ ఐడీ హ్యాక్…
బషీర్‌బాగ్‌లోని జస్ఫర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన మెయిల్ ఐడీని హ్యాక్ చేసిన సైబర్‌నేరగాళ్లు.. ఆ సంస్థ హెడ్ మెయిల్ పంపించినట్లు కరెంట్ ఖాతా ఉన్న కరూర్ వైశ్యా బ్యాంకుకు పంపించారు. అందులో తన వద్ద చెక్‌బుక్ అయిపోయిందని.. వెంటనే ఈ రెండు నంబర్లకు రూ. 8 లక్షలు, రూ. 9 లక్షల చొప్పున ఆర్టీజీఎస్ చేయండంటూ కంపెనీ హెడ్ మెయి ల్ పంపించినట్లుగా సైబర్‌నేరగాళ్లు పంపించారు. బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి కంపె నీ ప్రతినిధులకు ఫోన్ చేయగా.. తాము ఎలాంటి మెయిల్స్ పంపలేదని చెప్పారు. ఈ మేరకు కంపెనీవారి ఫిర్యాదుతో సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- investment app
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

