కానుకలు పంపించుకోండి..!

సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): వరుస పండుగలు రాబోతుండటంతో పోస్టాఫీస్ ‘డాక్ పార్సిల్ మహోత్సవ్’ సర్వీస్‌ను ప్రారంభించింది. స్నేహితులు, బంధువులకు పండుగ నేపథ్యంలో పంపించాల్సిన గిఫ్టులు, ఇతర వస్తువులను చేర్చేందుకు తపాల శాఖ సిద్ధమైంది. శనివారం నుంచి జనవరి 15 వరకు ‘డాక్ పార్సిల్ సేవలు’ కొనసాగుతాయని హైదరాబాద్ రీజన్ అసిస్టెంట్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ శుక్రవారం పేర్కొన్నారు. దసరా, దీపావళి, గురునానక్ జయంతి, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వరుస పండుగలు రాబోతున్న కారణంగా వినియోగదారులకు సేవలందించాలనే ఉద్దేశంతో ఈ సేవలు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.
పూర్తిగా కరోనా జాగ్రత్తలు పాటించి పార్సిల్ వస్తువులను అందిస్తామని అన్నారు. ప్రతి పోస్టాఫీసు కేంద్రంలో కరోనా జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారని చెప్పారు. పార్సిల్ ఆర్డర్ సంబంధిత అడ్రస్‌కు చేరే వరకు సమాచారం అంతా పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు. దేశ, విదేశాల్లో ఏ అడ్రక్కైనా చేరవేసే సదుపాయం కల్పించామన్నారు. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్యాకింగ్ వసతి హైదరాబాద్‌తో పాటు హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్‌లో ఉంటుందని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Millers | ప్రభుత్వం ఓడిందా? రైస్ మిల్లర్లు గెలిచారా?.. పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆకస్మిక బదిలీ
Bharat Summit | కరువు వేళ.. కాంగ్రెస్ వేడుక.. ఆర్భాటాలకు కోట్లు కుమ్మరిస్తున్న సర్కార్.. తాజాగా భారత్సమ్మిట్కు 50 కోట్లు
Horoscope | 13-11-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
రిమ్స్‌లో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల హవా
గులాబీ ఫుల్ ఖుష్.. ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

