మాదాపూర్, జూన్ 20: ఇల్లు, ఆఫీసు అందాన్ని రెట్టింపు చేసే ఇంటీరియర్ డిజైనింగ్‌పై నేటి యువత మక్కువ చూపుతుంది. అత్యాధునిక గృహలంకరణ, వినూత్న ఇంటీరియర్ డిజైన్లు, కంటిని ఆకట్టుకునే ఆర్కిటెక్చర్ శైలులను వీక్షించేందుకు మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఐఐఐడీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్) షో కేస్ ఇన్సైడర్స్ ఎక్స్ పో చక్కని వేదికైంది. 21వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనకు నగర వాసుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఇందులో ఏర్పాటు చేసిన పలు రకాల షో కేస్, డిజైనింగ్‌లను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
ఆధునిక లైటింగ్, ఫర్నిచర్ స్టాళ్లు..
దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డిజైనర్లు రూపొందించిన ప్రత్యేకమైన హోమ్ డెకార్ వస్తువులు, స్మార్ట్ హోమ్, అప్లయెన్సెస్, లగ్జరీ ఫర్నిచర్, ఎకో ఫ్రెండ్లీ (పర్యావరణ హిత) మెటీరియల్స్ స్టాళ్లను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఇల్లు, ఆఫీస్ స్పేస్‌లను తక్కువ ఖర్చుతో, అత్యంత ఆకర్షణీయంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుసుకునేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. సందర్శకులకు కేవలం ప్రదర్శన మత్రమే కాకుండా ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. నూతన గృహాలను నిర్మించుకునే వారికి పాత ఇండ్లను రీ మోడలింగ్ చేయాలనుకునే వారికి ఈ ప్రదర్శన ఎంతో ఉపయోకరంగా ఉందని సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లైఫ్ ైస్టెల్ ట్రెండ్స్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ..
ఐఐడీ షో కేస్ ఎక్స్ పోలో కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా నిపుణుల నుంచి వినియోగదారులకు కావలసిన సలహాలు, సూచనలు చేస్తున్నారు. సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ హోమ్ మేకోవర్ ఐడియాలు, వాస్తు ఆధారిత ఇంటీరియర్ ప్లానింగ్, ల్యాండ్ స్కేపింగ్ (గార్డెనింగ్) పై ప్రముఖ ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్లు ఇక్కడ ఉచితంగా సలహాలు, సూచనలు అందిస్తున్నారు. నూతన గృహాలను నిర్మించుకునే వారికి, పాత ఇండ్లను రీ మోడలింగ్ చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిర్వాహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ కేవలం సందర్శకులకే కాకుండా బిల్డర్లు, డెవలపర్లు, ఆర్కిటెక్చరల్ విద్యార్థులు, స్థానిక వ్యాపారవేత్తలకు ఒక మంచి వ్యాపార నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా మారిందన్నారు. నూతన మెటీరియల్స్ సరఫరా దారులతో నేరుగా డీల్స్ కుదుర్చుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. నేటితో ఈ ప్రదర్శన ముగియడంతో నగరవాసులు పెద్ద సంఖ్యలో విచ్చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అధునాతన లైఫ్ ైస్టెల్ ట్రెండ్స్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.