పండ్లలో విటమిన్.. ఇమ్యూనిటీ పెంచెన్

- పెరుగుతున్న ముప్పును అడ్డుకోవాలంటే రోగనిరోధక శక్తి తప్పనిసరి
- కరోనా నేపథ్యంలో విరివిగా పండ్లు కొంటున్న జనం
- డిమాండ్తోపాటే.. మండుతున్న పండ్ల ధరలు
- ఆకాశాన్ని అంటిన కొబ్బరి బోండాల ధరలు
బీ విటమిన్..సీ విటమిన్..డీ విటమిన్..బీ 12 విటమిన్..ఇలా కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల విటమిన్లను సమకూర్చుకోవాలంటే ఆయా పండ్లు తినాల్సిందే. ఈ విషయాలను వైద్యులే మనకు సూచిస్తున్నారు. జనం కూడా పాటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పండ్ల ధరలు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజల అవసరాలతో పాటు ఆ పండ్ల ధరలు కూడా పెరిగిపోయాయి. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు పండ్లు తినాలంటే మాత్రం కొంత ఆర్థిక భారం తప్పడం లేదు. ఏ రకం పండ్లు కొనాలన్నా.. వందల్లో ఖర్చు తప్పడం లేదు. నాలుగైదు వందలు పెడితే కానీ రెండు మూడు రకాల పండ్లు రాని పరిస్థితి నెలకొన్నది. ఒక్కో కుటుంబం పండ్ల కోసమే వారానికి కనీసం రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే నమ్మశక్యం కాదు.
భారీ డిమాండ్.. పెరిగిన ధరలు
- మామూలుగానే ఎండాకాలంలో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేని కారణంతో పండ్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.
- కానీ ఈ సారి మాత్రం కరోనా పరిస్థితుల్లో ధరలు మరింత మండుతున్నాయి.
- రోగ నిరోధకశక్తికి పండ్లు కీలకం కావడంతో అందరూ వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
- గతంలో పెద్దగా ఆసక్తి చూపని వారు సైతం పండ్లు తింటున్నారు.
- దీంతో డిమాండ్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ‘సీ’ విటమిన్ లభించే బత్తాయి, నారింజ, దానిమ్మ, కివీ, బొప్పాయి, జామ, ద్రాక్ష, ఆపిల్ తదితర పండ్ల ధరలు పెరిగాయి.
- రూ.100 పెడితే కానీ అరడజను నారింజ పండ్లు రావడం లేదు. రెండు నెలల క్రితం రూ.10కి ఒక నారింజ ఇచ్చేవారు.
- ఇప్పుడు అదే ధరకు అడుగుతుంటే వింతగా చూస్తున్నారు.
- రూ.50 పెడితే గానీ ఒక్క దానిమ్మ రావడం లేదు. ఒక్కో కివీ ఫ్రూట్ ధర రూ.30-40 మధ్య పలుకుతున్నది.
- బొప్పాయి కేజీ రూ.60-80 ఉంటున్నది. ఇక జామకాయలు కిలో రూ.60-70 వరకు చెప్తున్నారు.
- ద్రాక్ష కేజీ రూ.100-120 దాటిపోతున్నది. ఇక ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న అల్లనేరేడు పండ్లు కేజీ రూ.150-200 పలుకుతుండడం గమనార్హం.
- నిన్నమొన్నటి వరకు భారీగా ధర పలికిన మామిడి పండ్లు.. ఇప్పుడిప్పుడే అగ్గువయ్యాయి.
- గతంలో కిలో రూ.100-120 పలికితే.. ఇప్పుడు రూ.60-80 మధ్య దొరుకుతున్నాయి.
- పుచ్చకాయ ధరలు మాత్రం కాస్త అందుబాటులో ఉండటం ఊరటనిచ్చే అంశం. అవి కేజీ రూ.20-30 పలుకుతున్నాయి.
వారంలో 1.50 లక్షల టన్నులు..
రాష్ట్రంలో పండ్లకు భారీ డిమాండ్ పెరిగింది. అదే స్థాయిలో దిగుమతులు కూడా పెరుగుతున్నాయి. నగరంలోని గడ్డిఅన్నారం మార్కెట్‌కు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాల నుంచి పండ్లు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా నారింజ, బత్తాయి, మామిడి, కివీ, ఆపిల్ పండ్లు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. అన్ని పండ్లు కలిపి గత వారం రోజుల్లో గడ్డిఅన్నారం మార్కెట్‌కు దాదాపు 1.50 లక్షల టన్నులు రావడం గమనార్హం. నారింజ, యాపిల్, కివీ ఫ్రూట్స్ వంటివాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కివీ పండ్లను న్యూజిలాండ్, ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్ నుంచి, ఆరెంజ్ పండ్లను అమెరికా, ఈజిప్టు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. విదేశాల నుంచి మన రాష్ర్టానికి వచ్చిన పండ్ల కొనుగోలుకు ఇతర రాష్ర్టాల వ్యాపారులు కూడా పోటీ పడుతుండటం విశేషం.
వామ్మో కొబ్బరిబోండాం
కొబ్బరి బోండాం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు రూ.30-35 పలికిన ధర ఇప్పుడు రూ.50 కి పెరిగిపోయింది. కేరళ కొబ్బరి బోండాం కావాలంటే రూ.60 పెట్టాల్సిందే. ఈ నెలాఖరు వరకు కొబ్బరి బోండాం ధరలు రూ.70-80 వరకు పోయినా అశ్చర్యపోనవసరం లేదని ఓ వ్యాపారి వ్యాఖ్యానించడం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- immunity with fruits
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

