తుది దశకు సర్
‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (సర్) ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో తుది దశకు చేరుకుంది. కొద్ది నెలల కిందట విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ఆధారంగా, ఎన్యుమరేషన్ ఫారంలో సమాచారాన్ని పొందుపరచని ఓటర్లను గుర్తించి వారి సమగ్ర విచారణను వేగవంతం చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ వెల్లడించారు.
- 12.54 లక్షల మందికి నోటీసులు..
- 12.33 లక్షలకుపైగా హియరింగ్‌లు పూర్తి
- 30న ఓటర్ల తుది జాబితా ప్రచురణ
- హైదరాబాద్ జిల్లాలో
- కొత్తగా 2.18 లక్షల ఓటర్ల నమోదు
సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో తుది దశకు చేరుకుంది. కొద్ది నెలల కిందట విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ఆధారంగా, ఎన్యుమరేషన్ ఫారంలో సమాచారాన్ని పొందుపరచని ఓటర్లను గుర్తించి వారి సమగ్ర విచారణను వేగవంతం చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ వెల్లడించారు. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు గుర్తించిన 12,54,917 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 12,54,400 నోటీసులను అందజేశారు. మరో 517 నోటీసులు (కేవలం 4 శాతం పెండింగ్) మాత్రమే జారీ చేయాల్సి ఉందన్నారు. జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు 12,33,841 మంది ఓటర్ల (సుమారు 98.36 శాతం) హియరింగ్ లను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఇంకా నిర్వహించాల్సిన విచారణలు కేవలం 1.64 శాతం (20,559) మాత్రమే మిగిలి ఉన్నాయని పేరొన్నారు. పెండింగ్‌లో ఉన్న మిగిలిన నోటీసులను, విచారణలను త్వరితగతిన పూర్తి చేసి, నవంబర్ 30న హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలకు సంబంధించి తుది ఓటరు జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు వివరించారు.
3.96 లక్షల దరఖాస్తుల స్వీకరణ
‘సర్’ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయానికి ఇప్పటివరకు వివిధ రకాల ఫారాల ద్వారా మొత్తం 3,96,756 దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. ఫారం-6 (కొత్త ఓటు నమోదు) 2,18,005, ఫారం-6ఏ (ఎన్ఆర్ఐ ఓటర్లు) 4,591, ఫారం-7 (ఓటు తొలగింపు/అభ్యంతరాలు) 11,277, ఫారం-8 (చిరునామా మార్పు/బదిలీ/సవరణలు) 1,62,655లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

