అరచేతిలో మేడారం సమాచారం
ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే మేడారం సమ్మక-సారలమ్మ జాతరకు సంబంధించిన పూర్తి సమాచారం భక్తుల అరచేతిలో కనిపించనున్నది.
- మొబైల్ యాప్ ఆవిషరణ
- ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు
- భక్తులకు ఉపయోగకరంగా పూర్తి సమాచారం
ములుగు, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే మేడారం సమ్మక-సారలమ్మ జాతరకు సంబంధించిన పూర్తి సమాచారం భక్తుల అరచేతిలో కనిపించనున్నది. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జరుగనున్న మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య నేతృత్వంలో ‘మేడారం జాతర గైడ్ అఫీషియల్’ అనే మొబైల్ యాప్ను రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ వినియోగదారులు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. సీఎం కేసీఆర్ చిత్రపటంతో కూడిన యాప్ ప్రదర్శితమవుతుంది.
యాప్లో సమగ్ర సమాచారం
యాప్లో మేడారం జాతరకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ముఖ్యంగా కరోనా టీకా కేంద్రాలు, మరుగుదొడ్లు నిర్మించిన ప్రాంతాలు, జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, తాగునీటి కేంద్రాలు, మెడికల్ క్యాంపులు, వాహనాల పారింగ్ స్థలాలు, రోజువారీగా నిర్వహించే ముఖ్య పూజా కార్యక్రమాలు, ఆర్టీసీ బస్ స్టాండ్, తప్పిపోయిన వారి ఆచూకీ కనుగొనేందుకు ఏర్పాటు చేసిన మిస్సింగ్ కేంద్రాలతో పాటు రోడ్డు మార్గాలు, విడిది ప్రాంతాలు, జాతర మార్గాలు, తదితర వివరాలు ఉంటాయి. అంతేకాకుండా జాతరకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తమ తమ సెల్ ఫోన్ల ద్వారా అప్లోడ్ చేసే వెసులుబాటును కూడా ఈ యాప్లో కల్పించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

