Danam Nagender | హైదరాబాద్‌లో మాత్రం మామూలుగా ఉండదు.. హైదరాబాద్ ఎన్నికల కమిషనర్ కార్యాలయం తగలబడిపోతుందంటూ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం దానం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ గురించి రాహుల్ గాంధీ పదే పదే ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తుండు. ఇప్పుడు మా నియోజకవర్గంలో ప్రత్యేకించి 20 వేల ఓట్లు ఇప్పటివరకు కట్ చేశారు. నోటీసులు ఇచ్చారు. మరి దాన్ని సరిచేయాలన్నారు.
నా నియోజకవర్గంలో ఇప్పటివరకు 20 వేల ఓట్లు తొలగించారు.. ఇంకా ఎన్ని పోయాయో నాకు తెల్వదు. ఇందులో చాలా మంది బీజేపీతో అనుబంధంగా.. ఎవరైతే ఏఎంసీలున్నరో.. ఏఆర్‌వోలున్నరో బీజేపీతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఓట్లు తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. కాబట్టి కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న. ఎవరైతే మా ఓట్లు తీయించే ప్రయత్నం జరుగుతున్నదో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
నిజమైన ఓటర్లను, ఇంతవరకు 2000లో ఉండే 2002లొ ఉండే.. మళ్లీ ఇప్పుడు కూడా ఉండే.. మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఉండే.. ఇప్పుడు మాత్రం తీసేశారు. ఈ ఓటు చోరీ నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. తప్పకుండా ఇప్పటిదాకా డిలీట్ చేసిన ఓట్లను మళ్లీ పరిగణలోకి తీసుకొని అందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ ఎన్నికల కమిషన్ కార్యాలయం తగలబెడతాం
దానం నాగేందర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుంది
ఎన్నికల కమిషన్ అధికారులు బీజేపీతో కలిసి మా ఓట్లు తీయించారు.. ఎన్నికల కమిషన్… pic.twitter.com/I8N2u6BRHB
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2026
butterflies | రంగురంగుల సీతాకోకచిలుకలు, వాటర్ బర్డ్స్ సందడి చూశారా..? వీడియో
Dorothy | రానా సమర్పణలో కార్తీక్ సుబ్బరాజు గే లవ్‌స్టోరీ ‘డోరతీ’.. తెలుగు ట్రైలర్ రిలీజ్
Helicopter crash | జింబాబ్వేలో హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి