నంబర్ ప్లేట్ నచ్చినట్లు కుదరదు
ఎంతో ముచ్చటపడి కొన్న వాహనాలకు నచ్చినట్లుగా నంబర్ ప్లేట్లు అమర్చుకుంటామంటే ఇకపై కుదరదు.
- ఎంవీ యాక్ట్ ప్రకారమే ప్లేట్లపై నంబర్లు ఉండాలి
- హెచ్ఎస్ఆర్పీ అమర్చుకోవాల్సిందే
- ఇష్టారీతిగా నంబర్‌ప్లేట్ వినియోగిస్తే జరిమానా
- అవగాహన డ్రైవ్ చేపడుతున్న అధికారులు
సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఎంతో ముచ్చటపడి కొన్న వాహనాలకు నచ్చినట్లుగా నంబర్ ప్లేట్లు అమర్చుకుంటామంటే ఇకపై కుదరదు. చట్టవిరుద్ధంగా ఇష్టమొచ్చినట్టుగా నెంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేసే ప్రమాదం ఉంది. అందుకే ఇక నుంచి నిబంధనల మేరకు వాహనాల నంబర్ ప్లేట్స్ ఉండాలని.. ప్రయాణాన్ని మరింత సుఖమయం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇటీవల కాలంలో చాలా మంది తమ వాహనాల నంబర్‌ప్లేట్లపై ఇంగ్లిష్ అక్షరాలను పోలి ఉన్న అంకెలను అమర్చుకుంటున్నారు. BOSS, GOUD, IGOD, 1, 2, 3 ఇలాంటి నంబర్లతో చాలా వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. అయితే లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫ్యాన్సీ నంబర్లను కూడా నిబంధనలకు విరుద్ధంగా అమర్చితే ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అందులో భాగంగానే నంబర్ ప్లేట్ వాహనాలపై అధికారులు డ్రైవ్ కూడా చేపడుతున్నారు. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన నంబర్ ఆటోమెటిక్‌గా నిబంధనలకు అనుగుణంగా హెచ్ఎస్ఆర్పీ ప్లేట్ వస్తుంది. దానిని అమర్చుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వంకర టింకర వద్దే వద్దు..
కొంతమంది వాహనదారులు నంబర్ ప్లేట్‌ను ప్రయివేట్‌గా బిగించుకుంటున్నారు. వారికి నచ్చిన విధంగా రాసుకుంటున్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తే గానీ అది నంబర్‌గా కనిపించదు. తమ హోదాలు, పేర్లు, లక్కీనంబర్లు, సింబల్స్ ఇలా ఇష్టానుసారం రాసుకుంటున్నారు. నగరంలో ఇటీవల 0009 వచ్చిన ఓ కారు యజమాని నంబర్ ప్లేట్‌పై 9 అంకెను మాత్రమే అమర్చాడు. దీంతో అధికారులు అతడికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఇంకొందరు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఏదో ఒక అర్థం వచ్చేలా నంబర్లను వంకర టింకరగా మారుస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు అట్లాంటి వాహనాలపై చర్యలకు సిద్ధమయ్యారు. ప్రతి ఒక్కరికి హెచ్ఎస్ఆర్పీ(హై సెక్యూరిటీ ప్లేట్)పై అవగాహన కలిగించనున్నారు.
రూల్స్ ఇలా..
- ఎంవీ యాక్ట్ 1989 ప్రకారం ఎంవీ యాక్ట్ 50, 51 నిబంధనల ప్రకారం ద్విచక్రవాహనాలు, లైట్ మోటార్ వెహికిల్ కార్లు రిజిస్ట్రేషన్ అంకెలు, అక్షరాలు కచ్చితంగా వైట్ ప్లేట్‌పై బ్లాక్ కలర్లో ఉండాలి.
- కమర్షియల్ వాహనాలైతే యెల్లో ప్లేట్‌పై బ్లాక్ లెటర్స్‌తో నంబర్ ఉండాలి. రిజిస్ట్రేషన్ నంబర్ రెండు వరుసల్లో ఉండాలి. స్టేట్ కోడ్ (టీఎస్) అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ కోడ్ తర్వాత మిగిలిన నెంబర్ రెండో వరుసలో ఉండాలి.
- హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేస్తే వెహికిల్ వివరాలతో పాటు ఓనర్ డిటేయిల్స్ మొత్తం తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు.
నిబంధనల ప్రకారమే ఉండాలి
మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం నంబర్ ప్లేట్ ఎంత సైజులో ఉండాలి? వాటిపైన నంబర్లు ఎలా రాయాలి? లెటర్స్ మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. అలాంటి నంబర్ ప్లేట్‌కు బదులు మీ ఇష్టానుసారంగా నచ్చినట్టుగా రాసుకుంటే చర్యలు తీసుకుంటాం. అది నేరం. జరిమానాతో పాటు కొన్నిసార్లు వాహనాన్ని కూడా సీజ్ చేయాల్సి ఉంటుంది.
–పాండురంగ నాయక్, హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రుణ మోసం కేసు దర్యాప్తు అధికారం ఈడీకి ఉన్నది: హైకోర్టు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

