సిటీలో దొంగతనం.. గ్రామాల్లో విక్రయం
నగరంలో ద్విచక్ర వాహనాలు దొంగిలించి, గ్రామాల్లో విక్రయిస్తున్న ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ మంగళవారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
- ఇద్దరి అరెస్టు.. 16 వాహనాలు స్వాధీనం
సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): నగరంలో ద్విచక్ర వాహనాలు దొంగిలించి, గ్రామాల్లో విక్రయిస్తున్న ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ మంగళవారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఉప్పుగూడకు చెందిన టి. ఆకాశ్ పాత నేరస్తుడు. 2013లో అతడిని షాహినాయత్‌గంజ్, ఛత్రినాక పోలీసులు దొంగతనం కేసుల్లో అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన అతడు ఇటీవల తిరిగి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.
ఆకాశ్‌కు మహబూబ్‌నగర్ జిల్లా, కర్వెన గ్రామానికి చెందిన మహ్మద్ సోహెల్ పరిచయమయ్యాడు. ఆకాశ్ హైదరాబాద్‌లో చోరీ చేసిన వాహనాలను తక్కువ ధరకు మహ్మద్ సోహెల్ కొనుగోలు చేస్తున్నాడు. ఆ వాహనాలను సోహెల్ గ్రామాల్లో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఆకాశ్ ఛత్రినాక, షాహినాయత్‌గంజ్, కామాటిపుర, కాచిగూడ, మొఘల్‌పుర, మాదన్నపేట, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి, సోహెల్‌కు విక్రయించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్‌జోన్ క్రైమ్ టీమ్ ఇన్స్పెక్టర్ చంద్రకుమార్, ఛత్రినాక అదనపు ఇన్స్పెక్టర్ నాగరాజ్ కలిసి నిందితుడిని పట్టుకున్నారు. విచారించగా.. నేరాలను అంగీకరించడంతో పాటు రిసీవర్ మహ్మద్ సోహెల్ పేరును కూడా బయటపెట్టాడు. దీంతో జడ్చర్లకు వెళ్లిన పోలీసులు.. 16 వాహనాలను సోహెల్ నుంచి రికవరీ చేశారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ స్నేహా మెహ్రా తదితరులు పాల్గొన్నారు.
సీసీఎస్ మరింత బలోపేతం..
సీసీఎస్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు. జోన్ల వారీగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి, నగరంలో జరిగే నేరాలను వెంట వెంటనే ఛేదించడంలో తమవంతు పాత్రను పోషిస్తామని తెలిపారు. అన్ని జోన్లకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

