7 జోన్లు.. 73 ఠాణాలు
నగరంలో విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ కమిషనరేట్‌ను పునర్విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
- హైదరాబాద్ కమిషనరేట్.. కొత్తగా సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లు
- పునర్విభజనతో మరిన్ని డివిజన్ల ఏర్పాటు.. మహిళా, ట్రాఫిక్ ఠాణాల పెరుగుదల
నగరంలో విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ కమిషనరేట్‌ను పునర్విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా కొత్తగా 13 ఠాణాలు, 11 డివిజన్లు, 2 జోన్లు ఏర్పడనున్నాయి. మహిళలకు ప్రత్యేకంగా ఒక్కో జోన్‌కు ఒక పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కానున్నది. జోన్ల పునర్విభజన అనంతరం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇక నుంచి 73 ఠాణాలు, 28 డివిజన్లు, 7 జోన్లు ఉండనున్నాయి. అధికారుల కేటాయింపు కూడా పూర్తయ్యింది. ప్రతిపాదనలకు ఆమోద ప్రక్రియ తుది దశలో ఉంది.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ):
సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): నగర పోలీస్ కమిషనరేట్‌లో శాంతిభద్రతలు, మహిళా, ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పేర్లు, వాటి పరిధిల్లోకి వచ్చే ప్రాంతాలను నిర్ధారిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జోన్లను ఏర్పాటు చేస్తూ ఆయా జోన్లను పునర్విభజన చేస్తున్నారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్స్టేషన్ల పునర్విభజనతో నూతనంగా నగరంలో రెండు జోన్లు ఏర్పడనున్నాయి. ఇందులో భాగంగానే కొత్తగా 13 ఠాణాలు, 11 డివిజన్లు, 2 జోన్లు ఏర్పడుతున్నా యి.
మహిళలకు ప్రత్యేకంగా ఒక్కో జోన్‌కు ఒక్కో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కానున్నది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌లో జనాభా రోజురోజుకూ పెరుగుతున్నది.. అపార్టుమెంట్ల కల్చర్‌తోపాటు జనాభా కూడా పెరుగుతున్నది. దీనికి అనుగుణంగానే పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. ప్రస్తుతం వెస్ట్‌జోన్, నార్త్‌జోన్, సెంట్రల్ జోన్, ఈస్ట్‌జోన్, సౌత్జోన్లు ఉండగా 17 డివిజన్లు, 60 ఠాణాలున్నాయి. దీంతో ఐదు జోన్లను ఏడు జోన్లుగా విభజిస్తున్నారు. జోన్ల పునర్విభజన అనంతరం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 73 ఠాణాలు, ఏడు జోన్లు, 28 డివిజన్లుగా ఏర్పడనున్నది. అధికారుల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తి కాగా..నగర పోలీస్ కమిషనరేట్ నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడటమే ఆలస్యం..

ట్రాఫిక్ పీఎస్‌లు 31..
నగరంలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటివరకు ట్రాఫిక్ నార్త్, ట్రాఫిక్ వెస్ట్, ట్రాఫిక్ సెంట్రల్, ట్రాఫిక్ ఈస్ట్, ట్రాఫిక్ సౌత్ జోన్లో ఇద్దరు డీసీపీలు విధులు నిర్వర్తించే వారు. తాజా గా పెరిగిన ట్రాఫిక్ ఠాణాల నేపథ్యంలో ట్రాఫిక్‌లోనూ ట్రాఫిక్ డీసీపీ-3 పరిధిలో ట్రాఫిక్ సౌత్ ఈస్ట్, ట్రాఫిక్ సౌత్‌వెస్ట్ కొత్త జోన్లను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల ఠాణాలను పెంచినట్లే ట్రాఫిక్ ఠాణాలను కూడా పెంచారు. పాత ఠాణాల్లోని కొన్ని ప్రాంతాలను కొత్త వాటిలో కలిపి నూతన పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేశారు. గతంలో 25 ఉన్న ట్రాఫిక్ ఠాణాలు ఇప్పుడు 31కి పెరిగాయి.


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

