కేసీఆర్ వల్లే కుల సంఘాలకు గౌరవ భవనాలు
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుల సంఘాల అభివృద్ధికి పెద్ద పీట వేశారని మహేశ్వరం నియోజక వర్గం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సామ యాదిరెడ్డి గార్డెన్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహాత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయారు.
- ప్రజాస్వామ్య బద్ధంగా సంఘాలు నడవాలి
- ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట, జూన్ 9: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుల సంఘాల అభివృద్ధికి పెద్ద పీట వేశారని మహేశ్వరం నియోజక వర్గం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సామ యాదిరెడ్డి గార్డెన్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహాత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయారు. ప్రేమ్ కుమార్ గుప్త ఈ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలంతో పాటు డబ్బులు ఖర్చు పెట్టి కుల సంఘాల భవనాలు నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. ఆర్యవైశ్యులకు స్థలం రాకపోతే తాను ప్రయత్నం చేస్తానన్నారు. దేవాలయం నిర్మాణం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో సహకారం అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పరంగా రావలసిన వాటి గురించి డిమాండు చేస్తానన్నారు.
ఆర్యవైశ్యులకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. గత ఎన్నికలలో తనకు సహకరించిన ఆర్యవైశ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మీర్‌పేట ఆర్యవైశ్యులు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఓడినా.. గెలిచినా… అందరు అదే సంఘంలో ఉంటారు.. కనుక, సంఘం అభివృద్ధికి తన వంతు చేయూతను ఇస్తానన్నారు. ఆర్యవైశ్యులు డబ్బులు సమీకరించి వారి సంఘంలో ఉన్న పేదల పిల్లలకు సహకరించడం మంచి కార్యక్రమమన్నారు. కార్యక్రమంలోడిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, అమర వాది లక్ష్మి నారాయణ, రాజకీయ మహాసభ చైర్మన్ చింతల రవి కుమార్, జిల్లా అధ్యక్షులు తాడేపల్లి వెంకటేశం గుప్త, కోశాధికారి కిరణ్ గుప్త, బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గుప్త, కన్యకా పరమేశ్వరి ట్రస్టు చైర్మన్ తెరటిపల్లి శ్రీనివాస్ గుప్త, శ్రీరామ చంద్ర మూర్తి, సురేశ్, వెంకటేశ్వర్లు, దీప్లాల్ చౌహన్ తదితరులున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

