జరిమానా లేకుండానే నీటి బిల్లులు

ఉచిత నీటి సరఫరా పథకం కొరకు ఆధార్ అనుసంధానం చేసుకొని వినియోగదారులకు జలమండలి బిల్లులను జారీ చేస్తుంది. వాస్తవానికి బకాయి బిల్లులపై సుమారు 11 శాతం జరిమానాతో గతంలో జలమండలి బిల్లులను జారీ చేసేది. కాని, గతంలో బిల్లుల జారీ ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే ప్రస్తుతం గత ఐదు నెలల బిల్లులకు ఎలాంటి జరిమానా విధించకుండానే ఉచిత నీరు పథకానికి ఆధార్ అనుసంధానం చేయని వినియోగదారులకు మాత్రమే బిల్లులను జారీ చేస్తున్నట్లు జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ నెలాఖరు నాటికి క్యాన్ నెంబర్లతో ఆధార్ అనుసంధానం గడువు ముగిసింది.
12 లక్షలలో అర్హులు 3 లక్షల మందే…
మొత్తం 12 లక్షల మంది నీటి వినియోగదారులుండగా, సుమారు తొమ్మిది లక్షల మంది గృహ అవసర వినియోగదారులుండగా, మిగిలిన వారు కమర్షియల్, ఇండస్ట్రీయల్ వినియోగదారులున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సుమారు తొమ్మిది లక్షల మందిలో ఏప్రిల్ నెలాఖరు నాటికి కొత్తగా కేవలం 35 – 40 వేల వరకు మాత్రమే మీటర్లను బిగించుకొని ఆధార్ నెంబర్లను క్యాన్ నెంబర్లతో అనుసంధానం చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగానే అందిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

