కోకాపేట్ భూముల పేరుతో ప్రైవేటు ప్రకటనలు.. హెచ్ఎండీఏ ఫిర్యాదు
కోకాపేట్ | హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ ) ఆధ్వర్యంలో కోకాపేట్ లే అవుట్లో భూముల ఈ – ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతున్న

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ ) ఆధ్వర్యంలో కోకాపేట్ లే అవుట్లో భూముల ఈ – ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో దీనిని సాకుగాచూపి అమాయక ప్రజలను మోసం చేస్తున్న సీఎన్ఎన్ వెంచర్స్ అనే సంస్థపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ( సీసీఎస్ ) పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్టిసి లిమిటెడ్ ద్వారా జరుగుతున్న కోకాపేట్ భూముల ఈ–ఆక్షన్ ప్రక్రియ పూర్తికాకముందే ప్రజలను మభ్యపెట్టేవిధంగా సదరు సీఎన్ఎన్ వెంచర్స్ కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి వంచనకు గురిచేస్తున్న తీరును హెచ్ఎండిఏ తీవ్రంగా పరిగణించింది. కోకాపేట్ భూములను మార్కెట్ విలువలో యాబై శాతం పెట్టుబడులతో, 1,500 చదరపు అడుగుల వరకు 3బిహెచ్కె ఫ్లాట్ లను సొంతం చేసుకోవచ్చని సీఎన్ఎన్ వెంచర్స్ తమ ప్రకటనల ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్నది అని హెచ్ఎండీఏ పేర్కొన్నది.
ఒకవైపు కోకాపేట్ భూముల ఈ–ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతుండగా, తక్కువ ధరలకు/రేట్లకు పెట్టుబడులు పెట్టి 3బిహెచ్కె ఫ్లాట్లను కొనుగోలు చేసుకోవచ్చని సామాన్య ప్రజానీకాన్ని ప్రభావితం చేసే విధంగా వ్యవహరించి ప్రజల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న సీఎన్ఎన్ వెంచర్స్ పై చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ సెక్రెటరీ, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) ప్రాజెక్టు డైరెక్టర్ సంతోష్ ఐఏఎస్ శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
హెచ్ఎండీఏ భూముల వేలం పూర్తికాకముందే, నిర్ణిష్టమైన అనుమతులు లేకుండానే అమాయక ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్న సీఎన్ఎన్ వెంచర్స్ పై కఠిన చర్యలు తీసుకుని హెచ్ఎండీఏ ప్రతిష్టతను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపార ప్రకటనలను, లావాదేవీలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు విశ్వసించరాదని హెచ్ఎండీఏ సూచించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

