ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై రూఫ్‌టాప్ సోలార్
హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు వెంట ప్రయోగాత్మకంగా సోలార్ రూప్‌టాప్ సైకిల్ ట్రాక్ ప్రాజెక్టును చేపడుతున్నారు.
- టెండర్లు పిలిచిన హెచ్‌జీసీఎల్
- 29లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచన
- హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ వెల్లడి
సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు వెంట ప్రయోగాత్మకంగా సోలార్ రూప్‌టాప్ సైకిల్ ట్రాక్ ప్రాజెక్టును చేపడుతున్నారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందించింది.
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్ఆర్పై మొదట 23 కి.మీ మేర నిర్మిస్తున్న సోలార్ రూప్‌టాప్ సైకిల్ ట్రాక్ ప్రాజెక్టును మంత్రి కె.టి.రామారావు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచామని రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ,హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. ఈనెల 29 లోగా అర్హులైన కాంట్రాక్టర్లు తమ బిడ్లను దాఖలు చేయాలని, 16 నుంచి టెండర్లు బిడ్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చామని, ఈనెల 20న నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో ఫ్రీ బిడ్ మీటింగ్ ఉంటుందని తెలిపారు. టెక్నికల్ బిడ్‌ను ఈనెల 30న, ప్రైస్ బిడ్‌ను అక్టోబర్ 1న తెరిచి అర్హులైన కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేసి, ప్రాజెక్టు పనులు అప్పగిస్తామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

