ఒక్క కాల్ చేస్తే అన్నీ చూసుకుంటారు

- కొవిడ్ రోగులకు అండగా హెల్పింగ్ హ్యాండ్స్
- ఆహారం నుంచి ఆరోగ్యం వరకు వారిదే బాధ్యత
- ఉచితంగానే ఆక్సిజన్, మందులు, వైద్యసదుపాయం
- ఇంట్లోనే హోం ఐసోలేషన్ ఏర్పాటు
కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల లభ్యత గగనమవుతున్నది. సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఎలాగూ చికిత్స అందుతుండగా, స్వల్ప లక్షణాలున్న వారు ఇంట్లో ఉండడానికి భయపడుతున్నారు. ఇలాంటి వారు హోటళ్లు, రెస్టారెంట్లలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. చక్కటి వసతి, మంచి ఆహారం, పర్యవేక్షించేందుకు వైద్యులు, నర్సులు ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటున్నారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు.. హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలతో ఒప్పందం చేసుకొని కొవిడ్ సేవలందిస్తున్నాయి. వసతి, సౌకర్యాలను బట్టి రోజుకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు చార్జీ చేస్తున్నారు.
వారు.. ఎవరికి ఏమీ కారు. సమస్య వస్తే మాత్రం మేమున్నామంటూ భరోసా ఇస్తారు. ప్రస్తుత ఆపత్కాలంలో పాజిటివ్ వ్యక్తులకు సేవ చేయాలంటే పెద్ద మనసు ఉండాలి. రక్త సంబంధీకులే దూరంగా ఉంటున్న ఈ రోజుల్లో వారు మాత్రం మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన క్షణం నుంచి కోలుకునే వరకు అన్నీ తామై చూసుకుంటున్నారు. అమ్మలా అన్నం పెడుతూ.. నాన్నలా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ చేయూతనిస్తున్నారు. వారే హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సభ్యులు. కరోనా బాధితులకు సంరక్షకులు. పూర్తిగా కోలుకునే వరకు వారే బాధ్యత తీసుకుంటారు. ఒక్క కాల్ చేస్తే చాలు ఇక మన సమస్య వారిది అవుతుంది. ఆహారం నుంచి ఆరోగ్యం వరకు అన్ని జాగ్రత్తలు వారే తీసుకుంటారు. సేవలన్నీ ఉచితంగా అందించి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
సమస్య వారిదే ఇక..!!
- కొవిడ్ వచ్చిన వ్యక్తి 7386494043, 8790679505, 7893191193 లకు ఫోన్ చేసి వివరాలు చెబితే సరిపోతుంది.
- వెంటనే వారు ఆన్లైన్లో తమ వైద్య బృందాన్ని సంప్రదించి నేరుగా వారితో మాట్లాడిస్తారు.
- అనంతరం వైద్యుల సూచన మేరకు కావాల్సిన సేవలను అందిస్తారు.
- ప్రతి రోజు టిఫిన్, లంచ్, డిన్నర్ అందిస్తారు.
- రోగికి కావాల్సిన ఆక్సిజన్, పల్స్ ఆక్సీమీటర్, మందులు ఇంటికి వచ్చి అందిస్తారు.
- ప్రతి రోజు ఆన్లైన్లో వైద్యులు అందుబాటులో ఉంటారు.
- రోగి పరిస్థితి విషమంగా మారితే వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసే బాధ్యత తీసుకుంటారు.
- అందుకోసం అంబులెన్స్‌ను కూడా వారే ఏర్పాటు చేస్తారు.
- ఇంట్లో హోం ఐసోలేషన్ కేర్‌ను ఏర్పాటు చేస్తారు.
- ఇవన్నీ ఉచితంగానే అందిస్తారు. ఇలా ఆ వ్యక్తి కోలుకునే వరకు సేవలందిస్తారు.
సదా మీ సేవలో
వారం కిందటే సేవలు ప్రారంభించాం. ఇప్పటి వరకు 3 వందలకు పైగా కాల్స్ వచ్చాయి. సాధ్యమైనంత వరకు అందరికీ సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. కరోనా నిర్ధారణ అయ్యాక చాలా మంది టెన్షన్ పడుతున్నారు. అలాంటి వారికి మేం ధైర్యం చెబుతున్నాం. ఆర్థికంగా డబ్బలు లేక ఇబ్బందులు పడే వారికి మా సేవలు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. – ముజ్తబ ఆస్కారి, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఫౌండర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

