ప్రాణవాయువు.. ఇంటివద్దకే

- ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
- క్రౌడ్ ఫండింగ్ చేసి నేరుగా బాధితుడికే సాయం
- టీ హబ్ నుంచి సేవలందిస్తున్న https://WWWdonatekart.com
- సభ్యులుగా 1500 స్వచ్ఛంద సంస్థలు
- నాలుగేండ్లుగా 70 కోట్లు ఫండింగ్..
- కరోనా కాలంలోనే 55 కోట్ల మేర బాధితులకు సహాయం.. తాజాగా సైబరాబాద్ పోలీసు, ఎస్సీఎస్సీతో ఒప్పందం..
నాలుగేండ్లలో 1500 స్వచ్ఛంద సంస్థలకు వారధిగా నిలిచారు. రూ.70 కోట్ల క్రౌడ్ ఫండ్ సమకూర్చి వేలాది మందికి భరోసాగా మారారు. మరీ ముఖ్యంగా కరోనా కాలంలో ఏకంగా రూ.55 కోట్లు సమకూర్చారు. రోగులకు కావాల్సిన వైద్య సామగ్రి అందించారు. తాజాగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌తో పాటు వైద్య పరికరాలను ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు నడుం బిగించారు డొనేట్ కార్ట్(DONATE KART) సభ్యులు. ఇందులో భాగంగా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకున్నారు.
ఆన్లైన్ వేదికగా..
- దాతలు చేస్తున్న సాయం.. భాదితులకు సక్రమంగా అందుతుందా అన్న అనుమానాలు తలెత్తకుండా హైదరాబాద్‌కు చెందిన సందీప్ కుమార్, అనిల్ ఆన్లైన్ వేదికను ప్రారంభించారు.
- నాగ్‌పూర్ ఐఐటీలో చదివిన వీరిద్దరూ పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశారు. ఆ సమయంలో పలువురు దాతల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
- అంతేగాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందుకు వచ్చే దాతలు.. వారిచ్చే సామగ్రిపై ఆరా తీశారు.
- స్వచ్ఛందంగా పని చేసేందుకు అనేక ఎన్జీవోలు ఉన్నాయని గుర్తించిన వారు ఓ ఆలోచన చేశారు.
- గచ్చిబౌలిలోని కార్యాలయం తెరిచి https://WWWdonatekart.com వెబ్‌సైట్‌ను రూపొందించారు. దేశవ్యాప్తంగా 1500 స్వచ్ఛంద సంస్థలను సభ్యులుగా అందులో చేర్చారు.
- ఎవరైనా దాతల సాయం కావాలనుకుంటే ఈ వెబ్సైట్లో నమోదు చేసుకొని వారికి కావాల్సిన అవసరాన్ని వివరించాలి.
- అప్పుడు వారి విజ్ఞప్తిని ఎన్జీవోలు, దాతలు పరిశీలించి నేరుగా వెళ్లి సాయం చేస్తారు.
- ఇలా నాలుగేండ్లలో దాదాపు రూ.70 కోట్ల క్రౌడ్ ఫండింగ్ సమకూర్చి నిస్సాహాయులు, పేదలు, నిరాశ్రయులకు లబ్ధి చేకూర్చారు.
- కేవలం కొవిడ్ పంజా విసిరిన కాలంలోనే రూ. 55 కోట్ల క్రౌడ్ ఫండింగ్‌తో అనేక వర్గాలకు సాయం చేశారు.
- దీంతో డొనేట్ కార్ట్ వ్యవస్థాపకుల కృషిని గుర్తించిన నాస్కామ్ 2018లో ఇన్నోవేషన్ అవార్డుకు ఎంపిక చేయగా.. మంత్రి కేటీఆర్ వారికి అందజేశారు.
హెల్ప్ ఇన్ నీడ్‌కు నేరుగా సాయం..
ప్రాణవాయువు కావాలని కోరుతూ మా వెబ్సైట్లో అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. వాటిని అందించేందుకు మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఐసొలేషన్‌లో ఉన్న వారికి 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించాం. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ సైబరాబాద్‌తో కలిసి ప్రభుత్వ దవాఖానల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు కాన్సన్ట్రేటర్లు అందించేందుకు క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టాం. దాతలతో పాటు సాయం పొందిన వారి వివరాలను మా వెబ్సైట్లో పొందుపరుస్తున్నాం. ఎవరైనా సాయం చేయాలనుకుంటే మా వెబ్సైట్ ద్వారా నేరుగా బాధితులను చేరుకోవచ్చు. -సందీప్ కుమార్, డొనేట్ కార్ట్ వ్యవస్థాపకుడు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- help in need
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

