Heavy rain | హైదరాబాద్(Hyderabad) నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, బోరబండ, ఎర్రగడ్డ, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, ఎండవేడితో ఉక్కిరిబిక్కిరి అయిన నగర ప్రజలు వర్షం కురువడంతో ఉపశమనం పొందారు.