వనస్థలిపురం: వనస్థలిపురంలోని హయగ్రీవ దవాఖాన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ దొరికిపోయింది. వనస్థలిపురం గురుద్వారా రోడ్లో ఉన్న సదరు ఆస్పత్రి నిర్వాహకులు కొంత కాలంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్వోటీ పోలీసులు శుక్రవారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. దవాఖాన డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేశ్, ధనుశ్ క్లినిక్ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు.