బంజారాహిల్స్, మార్చి 25 : శ్రీ చైతన్య మహాప్రభు అవతరణ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నం.12లోని హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో సోమవారం గౌరపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యచంద్ర గౌరదాస, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.