బీసీ స్టడీ సర్కిళ్లలోనూ గ్రూప్స్ శిక్షణ
- జిల్లాలో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ ప్రారంభం..
- నోటిఫికేషన్ జారీ చేసిన జిల్లా బీసీ అభివృద్ధి అధికారి
- ఈ నెల 16న అర్హత పరీక్ష
- ఆన్లైన్ దరఖాస్తులకు ఈ నెల 16 ఉదయం 10 గంటల వరకు గడువు
సిటీబ్యూరో, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80,039 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి త్వరలోనే వరుస నోటిఫికేషన్లు ఇవ్వనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి పలు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ కార్యక్రమాలను మొదలు పెట్టారు. ప్రధానంగా గ్రూప్-1, 2, పోలీస్ ఉద్యోగాలతోపాటు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. అయితే, శిక్షణ కార్యక్రమాలు జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ ఇవ్వడానికి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభివృద్ధి శాఖలతో పాటు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న స్టడీ సర్కిళ్ల ద్వారా కూడా నిరుద్యోగులకు పోటీ పరీక్షల కోసం శిక్షణ మొదలు పెట్టారు. అందులో భాగంగా.. హైదరాబాద్ జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా త్వరలోనే జరుగబోయే గ్రూప్-1, గ్రూప్-2 శిక్షణ ఇవ్వడానికి శుక్రవారం జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు శిక్షణార్థులను ఎంపిక చేయడానికి ఈ నెల 16న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరు కావడం కోసం ఆసక్తి గల నిరుద్యోగుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.ఈనెల 16న ఉదయం 10 గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
https://studycircle.cgg.gov.in, https://mjpabcwreis.cgg.gov.in, https://unacadamy.com/scholor, ship/tsgovtscholarshiptest ఈ వెబ్సైట్లను సంప్రదించాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.ఆశన్న తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు శిక్షణ
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వరంలో ఉద్యోగ పోటీ పరీక్షలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు కోసం కూడా శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్న కౌకూర్ గ్రామంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో మూడు నెలల కోర్సులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో గుర్తించినవి ఐదు రకాల ఉపాధి కోర్సులు ఉన్నాయి..
1. ఎలక్ట్రిషియన్, వైరింగ్ 2. మొదలై రిపేరింగ్
3. అడ్వాన్స్డ్ బ్యూటీషియన్ /హెయిర్ కటింగ్
4. డ్రై క్లీనింగ్, క్లాత్ వాషింగ్ ఇన్ మోడరన్ మిషిన్
5. నోట్ బుక్ బైడింగ్
విద్యార్హతలు..
- పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి
- జిల్లా వెనుకబడిన తరగతుల కులానికి చెందిన వారై ఉండాలి
- కనీసం 18 ఏండ్లు నిండి 35 ఏండ్లు మించకుండా వయో పరిమితి ఉండాలి
- ఈ మేరకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 20వ తేదీ లోపు జిల్లాలోని గోల్నాకలో ఉన్న జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయానికి చేరుకునే విధంగా దరఖాస్తులు చేసుకోవాలి. మూడు నెలల శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేయబడుతాయని జిల్లా అధికారి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

