గ్రీన్ చాంపియన్ అవార్డు రావడం అభినందనీయం

వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 18 : దేశంలోనే ప్రతిష్టాత్మకమైన గ్రీన్ చాంపియన్ అవార్డుకు సంగారెడ్డి వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల ఎంపిక కావడం అభినందనీయమని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు అన్నారు. బుధవారం తన కార్యాలయంలో వారిని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో స్వచ్ఛత, వాటర్ మేనేజ్మెంట్, శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్తో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల అమలు తీరును బట్టి గ్రీన్ చాంపియన్ అవార్డుకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ అవార్డును మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేతులమీదుగా అందజేశారన్నారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారులు డాక్టర్ పి.రమేశ్, డాక్టర్. డి.అనిల్‌ను బుధవారం రాజేంద్రనగర్‌లోని పరిపాలన భవనంలో అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్, డీఎస్ఏ డాక్టర్ జె.సత్యనారాయణ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ సీమ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Green Champion Award
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

