11,538 నిర్మాణాలు.. రూ.797 కోట్లు రాబడి

2020-21 ఆర్థిక సంవత్సరంలో 11,538 నిర్మాణ అనుమతుల ద్వారా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగానికి రూ.797.13 కోట్ల ఆదాయం వచ్చిందని శనివారం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 67 హైరైజ్డ్ భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు 1574 అక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా రియల్ ఎస్టేట్ రంగాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం గత జులై నుంచి భవన నిర్మాణ అనుమతుల ఫీజుల్ని నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. అనుమతి పొందగానే ఒక వాయిదా, మిగతా మూడు వాయిదాలు ఆర్థిక సంవత్సరం ( ఈ ఏడాది మార్చి 31) ముగిసేలోగా చెల్లించేలా అవకాశం కల్పించిందన్నారు. మొత్తం ఒకేసారి చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పించామని అధికారులు వివరించారు. ఈ వాయిదాల చెల్లింపుల అవకాశాన్ని బిల్డర్లు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. కాగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 17 వేల అనుమతుల ద్వారా రూ.957కోట్లు ఆదాయం వస్తే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో భవన నిర్మాణాలపై కరోనా ప్రభావం తాత్కాలికంగా పడింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

