కల్తీరాయుళ్లపై ఉక్కుపాదం
నాణ్యతా ప్రమాణాలను పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక డ్రైవ్‌కు సిద్ధమైంది. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఆయా సెంటర్లపై ఫుడ్ సెఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ వ్యాన్‌తో తనిఖీలు విస్తృతం చేయనున్నారు.
- హోటళ్లు, రెస్టారెంట్లపై నేటి నుంచి స్పెషల్ డ్రైవ్
- ప్రజారోగ్యానికి జీహెచ్ఎంసీ పెద్దపీట
- ఆహార నాణ్యతాప్రమాణాలపై అవగాహన
- ప్రతి రోజూ ఒక సరిల్లో అధికారుల పర్యటన
- ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ వ్యాన్‌తో తనిఖీలు
- జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబరు 040- 2111 1111
సిటీబ్యూరో: నాణ్యతా ప్రమాణాలను పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక డ్రైవ్‌కు సిద్ధమైంది. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఆయా సెంటర్లపై ఫుడ్ సెఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ వ్యాన్‌తో తనిఖీలు విస్తృతం చేయనున్నారు.
ఒకవైపు ఆహారకల్తీపై నిర్వాహకులకు అవగాహన కల్పిస్తూనే మరో వైపు నాణ్యతా ప్రమాణాలు పాటించని షాపులపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా నిలిచిన మొబైల్ వ్యాన్‌తో తనిఖీలను శుక్రవారం నుంచి విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని..
కోటికి పైగా జనాభా కలిగిన గ్రేటర్లో దాదాపు 12 నుంచి 14 వేల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయిల్ నుంచి మొదలు ఉప్పు దాకా నాణ్యమైన వాటిని వినియోగించి నిర్వాహకులు క్వాలిటీ ఫుడ్‌ను అందించాలి. జీహెచ్ఎంసీ స్టాంప్ వేసిన మాంసాన్ని వాడాలి. కానీ నియమ, నిబంధనలను పక్కన పెట్టేసి ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
వంట గదులు పరిభ్రదత పాటించడం లేదు..ఫుడ్ తయారీలో ప్రతిదీ కల్తీ వస్తువులను ప్రోత్సహిస్తున్నారు. పైగా పాచిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తిరిగి వేడి చేసి పెడుతున్నారు. మాంసం అయితే రోజుల తరబడి ఫ్రిజ్‌లో పెట్టి దానికి మాసాలాలు దట్టించి మరుసటి రోజు వాడుతున్నారు. బిర్యానీలో బొద్దింకలు, వెంట్రుకలు వస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఈ జాబితాలో చిన్న హోటళ్లు నుంచి బడా హోటళ్ల నిర్వాహకులు ఉంటున్నారు.
తరచూగా జీహెచ్ఎంసీకి నిత్యం 10 వరకు పైగా ఫిర్యాదులు ఇలాంటివే ఎక్కువగా వస్తున్నాయి. మెరుగైన పౌర సేవలు, ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కల్తీరాయుళ్ల భరతం పట్టాలని బల్దియా నిర్ణయించింది.
స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి నాణ్యత పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు తొలుత జరిమానాలు, ఆ తర్వాత సంబంధిత వాటిని సీజ్ చేయడం వంటి చర్యలు చేపట్టనున్నారు. కల్తీ ఉన్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఆహార నాణ్యతా ప్రమాణాల విషయంలో అనుమానాలు ఉంటే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 040- 2111 1111లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

మొబైల్ వ్యాన్ ప్రత్యేకతలు
మొబైల్ వ్యాన్‌లో డిజిటల్ బ్యాలెన్స్, డిజిటల్ మల్టీ పార మీటర్, హ్యాండ్ మిల్లీ మీటర్ (పీహెచ్ కండెక్టివిటీ, టీడీఎస్, టెంపరేచర్), డిజిటల్ రీ ఫ్యాక్టో మీటర్ పోర్టబుల్, హాట్ ప్లేట్, హాట్ ఎయిర్ ఓవెన్, రాపిడ్ మిల్ సీనింగ్ ఉపకరణాలు, మిక్సర్ గ్రైండర్ వంటి పరికరాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
ఫుడ్ స్టోరేజ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్లు ఉంటారన్నారు. స్ట్రీట్ వెండర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటళ్లు, రెస్టారెంట్లలో వాడుతున్న సంబంధిత పదార్థాలు, ఆయిల్స్, బేకింగ్ పౌడర్, కాన్ ఫ్లెక్స్, మసాలాలు, బెల్లం, చకెర వంటి పదార్థాలపై సరిళ్ల వారీగా తనిఖీలు చేపడుతామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

