సమస్యలను ఆలకిస్తూ.. బాధితులను ఆదరిస్తూ..

- సందేహాల నివృత్తితో భరోసా
- మంగళవారం ఒక్క రోజే 250 మంది సద్వినియోగం
- సత్ఫలితాన్నిస్తున్న జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం
- 040-2111 1111ను సద్వినియోగం చేసుకోవాలని వైద్యుల సూచన
: గ్రేటర్లో కరోనా విలయతాండవం చేస్తోంది. అడుగు బయట పెట్టాలంటేనే జనాన్ని వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ లక్షణాలుంటే ఏం చేయాలి? అత్యవసరంలో ఆసుపత్రులలో ఆక్సిజన్, రెమ్డెసివర్లు అందుబాటులో ఉన్నాయా? హోం ఐసోలేషన్‌లో ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర సందేహాలను నివృత్తి చేసుకునేందుకు జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం 040-2111 1111ను ఏర్పాటు చేయగా, ఈ కేంద్రం సత్ఫలితాన్ని ఇస్తోంది. ఈ కంట్రోల్ రూమ్‌కు కేటాయించిన నంబర్‌కు రోజూ వందల సంఖ్యలో బాధితులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వారి సందేహాలను శ్రద్ధగా వింటున్న సిబ్బంది వాటికి నివృత్తి చేస్తున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాల ని వైద్యులు భరోసా ఇస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 250 మంది ఫోన్ చేశారు. ప్రత్యేకంగా నియమించిన వైద్యాధికారులు వీరికి తగు సలహాలు, సూచనలు అందించారు.
అధికంగా పాజిటివ్ బాధితులే..
- కంట్రోల్ రూమ్‌కు వస్తున్న ఫోన్ కాల్స్‌లలో ఎక్కువగా కొవిడ్ బాధితులకు సంబంధించినవే ఉంటున్నాయి.
- పాజిటివ్ వస్తే వైద్య సే వలు ఎక్కడ పొందాలి?
- ఎలాంటి మందులు వేసుకోవాలి?
- టీకాలు తీసుకున్నాం? చలి జ్వరంగా ఉంది.
- ఎలాంటి మందులు వేసుకోవా లి? కొవిడ్ పరీక్షలు చేసుకున్నాం. ఇంకా ఫలితాలు రాలేదు.
- ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోసారి పరీక్ష చేసుకున్నాం.
- ఇలా తదిత ర సమస్యలను బాధితులు ఎకరువు పెడుతున్నారు.
- వారు అందించిన వివరాలను ఓపికగా విని సందేహాలను, నివృత్తి చేస్తున్నారు.
రెండు విడతలుగా విధులు
గ్రేటర్లో కొవిడ్ సంబంధిత వైద్య సహాయాన్ని, కొవిడ్ పాజిటివ్ వస్తే చేపట్టాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మందులు తదితర సలహాలు, సూచనలు అందించేందుకు జీహెచ్ఎంసీ కొవిడ్ కంట్రోల్ రూం నుంచి వైద్యులు పనిచేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 8 గం టల నుంచి మధ్యాహ్నం 2 గంటలు, తిరిగి రెండు నుం చి రాత్రి 8 గంటల వరకు రెండు షిప్టులలో వైద్యులు కంట్రోల్ రూం నుంచి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- GHMC
- ghmc helpline
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

