మరో 3 జంక్షన్ల అభివృద్ధి
గ్రేటర్ హైదరాబాద్‌లో మరో మూడు చోట్ల జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. రవీంద్రభారతి, జర్నలిస్టు కాలనీ, జగన్నాథ ఆలయం వద్ద ఉన్న జంక్షన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది.
- రవీంద్రభారతి, జర్నలిస్టు కాలనీ, జగన్నాథ్ టెంపుల్ జంక్షన్లు ఎంపిక
- క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిపాదనలకు ఆదేశించిన కమిషనర్ రోనాల్డ్ రోస్
సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్ : గ్రేటర్ హైదరాబాద్‌లో మరో మూడు చోట్ల జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. రవీంద్రభారతి, జర్నలిస్టు కాలనీ, జగన్నాథ ఆలయం వద్ద ఉన్న జంక్షన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. సోమవారం జరిగిన 64వ సిటీ కన్వర్జెన్స్ సమావేశంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ మంగళవారం అధికారులతో కలిసి పర్యటించారు.
రవీంద్రభారతి కూడలి వద్ద పాదచారులకు ప్రమాదాల నివారణకు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, జర్నలిస్టు కాలనీ జంక్షన్ అభివృద్ధి, జగన్నాథ ఆలయం వద్ద డివైడర్ పునర్నిర్మాణం పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ పోలీస్ అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు రూపొందించాలని కమిషనర్ సూచించారు.ఈ పర్యటనలో ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్, ఈఎన్సీ జియావుద్దీన్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

