వరద నీటి నివారణపై ప్రత్యేక దృష్టి
గ్రేటర్ వరద నీటి నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. గురువారం శేరిలింగంపల్లి జోన్ మాదాపూర్ సర్కిల్లో జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్‌తో కలిసి కమిషనర్ మాదాపూర్ బాటా షోరూం, యశోద దవాఖాన, శిల్పారామం తదితర ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను పరిశీలించారు.
- కమిషనర్ రొనాల్డ్ రాస్
సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ వరద నీటి నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. గురువారం శేరిలింగంపల్లి జోన్ మాదాపూర్ సర్కిల్లో జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్‌తో కలిసి కమిషనర్ మాదాపూర్ బాటా షోరూం, యశోద దవాఖాన, శిల్పారామం తదితర ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను పరిశీలించారు.
వరద నీరు నిలువకుండా శాశ్వత చర్యలు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. త్రిశూల్ గ్రాండ్ వద్ద సైడ్ రోడ్డు ప్రతిపాదనకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, బాటా షోరూం వద్ద సైడ్ వెంట్స్ క్లియర్, డిసిల్టింగ్ చేయాలని, విక్రమ్ దవాఖాన రోడ్డులో కొత్త బాక్స్ డ్రైన్‌ను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ శంకర్, డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు.
వేగవంతంగా ఆన్లైన్ దరఖాస్తులను పరిష్కరించాలి
జీహెచ్ఎంసీలో ఆన్లైన్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. ‘మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ వెబ్సైట్, డయల్ 100, కాల్ సెంటర్‌కు ఆన్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
గురువారం జీహెచ్ఎంసీలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో వివిధ సమస్యలపై ఆన్లైన్లో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులపై సమీక్షించారు. శాఖల వారీగా వచ్చిన గ్రీవెన్స్‌లను ప్రతి రోజు హెచ్వోడీలు పరిశీలించాలని, ఫిర్యాదు రాగానే సంబంధిత ఫిర్యాదుదారుడికి కాల్ చేసి తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆయా విభాగాల హెచ్వోడీలు శ్రీ వాత్సవ, స్నేహ శబరీష్, ఈఎన్సీ జియా ఉద్దీన్, సీఈ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు రవి కిరణ్, ఉపేందర్ రెడ్డి, యాదగిరి రావు, సత్యనారాయణ, నళిని పద్మావతి, మంగతాయారు, సునంద తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

