NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
NXTinAI | సినీ దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక రంగ నిపుణులు హాజరైన ‘నెక్ట్స్ఇన్ఏఐ’ ప్రత్యేక సదస్సు కార్యక్రమంలో సినిమా నిర్మాణంలో ఏఐ వినియోగం, భవిష్యత్ అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
NXTinAI | హైదరాబాద్ : సామాజిక మాధ్యమాలు, మొబైల్ స్క్రీన్లకే పరిమితమైన కృత్రిమ మేధ ఇకపై థియేటర్లలో భారీ తెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ అనుబంధ సంస్థ ‘గ్యాలరీ5 ఏఐ స్టూడియో’ ఆధ్వర్యంలో నగరంలోని పార్క్ హయత్‌లో ‘నెక్ట్స్ఇన్ఏఐ ’ పేరిట ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
సినీ దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక రంగ నిపుణులు హాజరైన ఈ కార్యక్రమంలో సినిమా నిర్మాణంలో ఏఐ వినియోగం, భవిష్యత్ అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే స్టార్ ప్లస్, జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన ‘మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్’ సిరీస్‌లో ఏఐ ఆధారిత కథన రూపకల్పన విజయవంతమైంది. ప్రస్తుతం స్టార్ స్టూడియో18 నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘చిరంజీవి హనుమాన్’ అనే పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్‌ను ఏఐ సాంకేతికతతో థియేటర్ల కోసం సిద్ధం చేస్తున్నారు.
4కే సినిమాటిక్ నాణ్యత..
భారీ తెరపై స్పష్టత తగ్గకుండా 4K రిజల్యూషన్‌లో విజువల్స్, అధునాతన ఏఐ-వీఎఫ్ఎక్స్ (VFX) అందించే సాంకేతికతను ఆవిష్కరించారు. కథ అంతటా పాత్రల రూపం, హావభావాలు ఏకరూపత (consistency) కోల్పోకుండా ఉంచే టూల్స్‌ను ప్రదర్శించారు. కథా చర్చల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు సమగ్ర నిర్మాణ ప్రక్రియను సులభతరం చేసే వర్క్ ఫ్లోలను రూపొందించారు.
క్రియేటివ్ రంగానికి, సాంకేతికతకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉండటంతోనే ఈ వేదికను ఎంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రయోగాత్మక దశ నుంచి వాస్తవ చలనచిత్ర నిర్మాణంలోకి కృత్రిమ మేధ అడుగుపెడుతున్న తరుణంలో, భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రపంచస్థాయిలో ముందంజలో ఉండేలా ఈ సాంకేతికత దోహదపడుతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సదస్సులో ఏర్పాటు చేసిన ‘ఏఐ ఎక్స్పీరియన్స్ సెంటర్’ ద్వారా పలువురు సృష్టికర్తలు ఈ అధునాతన సాధనాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

