ఆహార వ్యర్థాలతో.. ఆరోగ్య ఫలాలు

- ఫలిస్తున్న ప్రయోగం
- మహిళా సంఘాల ద్వారా ప్రచారం
- ఆదర్శంగా నిలుస్తున్న తూంకుంట మున్సిపాలిటీ
- ప్రజలు వినియోగించే ప్రతి వస్తువును తిరిగి ఉపయోగించుకోవచ్చని
శాస్త్రవేత్తలు ఏనాడో చెప్పారు. నిత్యం ఇండ్ల నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను ఊరికే పారేయకుండా పోగు చేసుకుంటే లాభం చేకూరుతుందని చెబుతున్నది తూంకుంట మున్సిపాలిటీ. అధికారుల అవగాహనతో ప్రజలు తడిచెత్తను కంపోస్టు ఎరువుగా మారుస్తూ ఇంటి ఆవరణ మొక్కలకు, మిద్దె తోటలకు వినియోగిస్తూ ఆరోగ్య ఫలాలను పొందుతున్నారు.
శామీర్‌పేట, మార్చి 9 : పనికిరాని చెత్త నుంచి శక్తిని పుట్టించడం… ఆ శక్తి మానవాళికి ఉపయోగదాయకంగా రూపొందించడం కష్టమైన పనే. అయినప్పటికీ కార్యదీక్షతో సుసాధ్యమే అని నిరూపించారు తూంకుంట మున్సిపాలిటీ అధికారులు. ఎరోబిక్ విధానంతో తడిచెత్తను కంపోస్టు ఎరువుగా మారుస్తున్నారు. దీంతో తడిచెత్త బెడద తీరడంతోపాటు ఇంట్లోని కూరగాయ వ్యర్థాలతో కంపోస్టు ఎరువు, క్రిమిసంహారక ద్రావణాలు లభిస్తున్నాయి.
ఎరోబిక్ విధానంతో…
మున్సిపాలిటీలో రోజుకు 5.8 టన్నుల తడిచెత్త ఉత్పత్తి అవుతుంది. ఇంటి నుంచే చెత్తను తగ్గించాలనే ఆలోచనతో ప్రారంభమైన ప్రయోగం.. ఎరోబిక్ విధానంతో సాధ్యమవుతుందని నిరూపించింది. తొలుత మెప్మా ఆర్పీలతోపాటు అనురాగ్ అపార్ట్‌మెంట్‌కు చెందిన 10 కుటుంబాలకు, కుషల్ షేరిన్ గేటెడ్ కమ్యూనిటీలోని 30 కుటుంబాలకు బిన్స్‌ను పంపిణీ చేశారు. తద్వారా కంపోస్టు ఎరువును తయారు చేసి ఇంటి ఆవరణ మొక్కలకు, మిద్దెతోటలకు ఉపయోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.
రోజుకు 14 టన్నుల చెత్త..
తూంకుంట మున్సిపాలిటీలో 2011 లెక్కల ప్రకారం 24,187 జనాభా ఉండగా ప్రస్తుతం 39 వేలకు చేరింది. మొత్తం గృహ సముదాయాలు 7262, కమర్షియల్ 740 ఉన్నాయి. రోజుకు తలసరి (ఒక్కొక్కరి నుంచి) 250 గ్రాముల చెత్త ఉత్పత్తి అవుతుండగా, మున్సిపల్ పరిధిలో రోజుకు సగటున 14 టన్నుల చెత్త (5.8 తడిచెత్త, 8.2 పొడిచెత్త) ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 16 వార్డుల్లో 11 ఆటో ట్రాలీల ద్వారా తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు.
కంపోస్టు ఎరువు తయారీ ఇలా..
మై గ్రీన్ బిన్ పేరుతో గల ఒక ట్యాబ్ బిన్(డబ్బా), రాడ్, మెష్, 2 కేజీల కోకోపిట్ తీసుకోవాలి. రోజూ ఇంట్లో ఆహార, కూరగాయ వ్యర్థాలు, తడిచెత్త ఒక లేయర్(పొరలాగా)గా వేసి దానిపై ఒక లేయర్‌గా కోకోపిట్ వేయాలి. ఇలా 30 రోజులు లేయర్ పద్ధతిని పాటించిన తర్వాత కంపోస్టు ఎరువుతోపాటు మిశ్రమం తయారవుతుంది. మిశ్రమాన్ని (పిప్పిని)కంపోస్టు ఎరువుగా, ద్రావణాన్ని క్రిమిసంహారక, పోషకాహర మిశ్రమంగా ఉపయోగించుకోవచ్చు.
చెత్తను తగ్గించేందుకు..
తూంకుంటలో ప్రస్తుతం 14 టన్నుల వరకు తడి, పొడిచెత్త ఉత్పత్తి అవుతున్నది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చెత్తను శక్తిగా మార్చేందుకు అవగాహన కల్పిస్తున్నాం. వంటింటి వ్యర్థాలతోనే కంపోస్టు ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టాం. – గణేశ్, పర్యావరణ ఇంజినీర్, తూంకుంట
చాలా బాగుంది
ఇంట్లో ఆహార వ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారీ పద్ధతి ఎంతో సులభంగా ఉంది. ప్రస్తుతం మా ఇంట్లో ఆహార, కూరగాయ వ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారు చేసి మొక్కలను ఉపయోగిస్తున్నాను. ఆహార వ్యర్థాలే సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యమైన ఫలాలు, కూరగాయలను అందిస్తున్నాయి. – కవిత, మెప్మా ఆర్పీ, తూంకుంట
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- food waste
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

