గడప దాటకుండా గడిపేద్దాం

- ఇంట్లో ఉంటూ ఫిట్నెస్ పొందవచ్చు
- కాలక్షేపం కోసం పుస్తక పఠనం మేలు
- ఆటలతో ఆరోగ్యం, పాటలతో ఆహ్లాదం
- నడిచినా, నచ్చిన పనులు చేసినా ఆంనదదాయకం
- వాకింగ్, యోగాతో ఒత్తిడి మాయం
సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ) : కరోనా పంజా విసురుతున్నది. మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం కఠినంగా లాక్డౌన్ విధించింది. 20 గంటలపాటు ఇంట్లో నుంచి బయటకెళ్లే పరిస్థితి లేదు. ఇంట్లో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఇప్పుడు అందరినోట వినిపిస్తున్న మాట. సమయాన్ని చక్కగా వినియోగించుకుంటే ఆరోగ్యానికి తోడు విజ్ఞానాన్ని ఎంచక్కా పెంచుకోవచ్చు. వయస్సు ఆధారంగా వివిధ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటి మేడపైన లేదా ఇంటి ఆవరణలో వాకింగ్ చేయొచ్చు. యోగాసనాలతో ఒత్తిడి తగ్గించుకోవచ్చు. కావాల్సిన పుస్తకాలు, నవలలు, పొడుపు కథలు, నీతి కథలు పుస్తకాలు చదివి సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. నచ్చిన ఆహార పదార్థాలు చేసుకొని ఆస్వాదించొచ్చు. లాక్డౌన్ సమయంలో గడప దాటకుండా ఎలా గడపాలో తెలుసుకుందాం..
పుస్తకాలు చదువుదాం..
ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని అనే బదులు నచ్చిన పుస్తకాలు చదవచ్చు. పుస్తకాలు అందుబాటులో లేకుంటే ఇంటర్నెట్లో కావాల్సిన పుస్తకాలు పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. గూగుల్‌లో తెలుగు బుక్స్, ఓల్డ్ తెలుగు బుక్స్, ఫిలాసఫీ బుక్స్, అలాగే లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ తెలుగు బుక్స్ ఆన్లైన్ పేర్లతోపాటు అన్ని భాషల పుస్తకాలను ఆన్లైన్లో చదవడం లేదా పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని బోర్ అనిపించినప్పుడల్లా చదవచ్చు.
ఇలా చేస్తే ఆనందంగా..
- వ్యాయామం చేసినప్పుడు ఎండార్పిన్ హార్మోన్ విడుదలవుతుంది. నవ్వితే ఇది మరింత ఎక్కువగా విడుదలైతుంది. రోజులో 30 నిమిషాలపాటు వ్యాయామం చేయడంతోపాటు సాధ్యమైనంత వరకు నవ్వుతూ, పుస్తకాలు చదువుతూ ఉండాలి.
- మనకు నచ్చిన పనులు చేస్తున్న సమయంలో డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. ఉదాహరణకు చీర, కారు, బైక్, నగలు, ఆఫీస్‌లో ప్రశంసలు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటున్నామంటే దానికి కారణం ఈ డోపమైన్ హార్మోనే కారణం.
- స్నేహితులకు ఏదైనా సాయం చేస్తూ ఉండాలి. అప్పుడు మన శరీరంలో సెరిటోనిన్ హార్మోన్ విడుదలవుతుంది. కొవిడ్ కాలంలో మనకు చేతనైనా సాయం చేస్తూ ఉండాలి. కనీసం ఫోన్లోనైనా పలకరిస్తూ ధైర్యం చెప్పాలి.
- మరుపురాని ఘటనలు గుర్తు చేసుకున్నప్పుడు, మీ పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవుతుంది.
యోగాతో ఒత్తిడిని జయిద్దాం
శరీరాన్ని, మనసును ఏకాగ్రతలో ఉంచే ఆయుధం యోగా. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో యోగా చేయడం ఎంతో శ్రేయస్కరం. మానసిక ఒత్తిడిని సులభంగా అధిగమించవచ్చు. కొవిడ్ బాధితులతోపాటు సాధారణ పౌరులు ఉదయం, సాయంత్రం ఆసనాలు వేయడం మంచిది. ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లతోపాటు వారి కుటుంబ సభ్యులు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా యోగా చేయడం వలన రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
నడకతోచక్కటి ఆరోగ్యం
మంచి ఆరోగ్యానికి నడకను మించింది లేదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంటి డాబాపై లేదా ఇంటి ఆవరణలో వాకింగ్ చేయడం వల్ల కాలక్షేపంతోపాటు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. రోజూ నడవడం వల్ల ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండటంతోపాటు రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు దరిచేరవు. కుంగుబాటుకు లోనైనప్పుడు వ్యాయామం చేయడం, ఇంటి పనుల్లో భాగస్వామ్యం కావడం, కుటుంబ సభ్యులతో నిత్యం మాట్లాడుతుండాలి.
భవిష్యత్ ప్రణాళికలు
ప్రస్తుతం ఎవరి పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కుటుంబం కోసం భవిష్యత్‌లో చేయాల్సిన పనులపై దృష్టి పెట్టాలి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లయితే..పునర్జన్మలా భావించి
ముందున్న భవిష్యత్ గురించి ప్రణాళిక రూపొందించుకోవాలి.
ఇండోర్ ఆటలే ముద్దు
లాక్‌డౌన్‌తో చాలామంది అనేక రకాల ఆటలు ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అవుట్డోర్ ఆటలు తగ్గించి సాధ్యమైనంత వరకు ఇండోర్ ఆటలను కుటుంబసభ్యులతో కలిసి ఆడటమే మేలు. క్యారంబోర్డు, చెస్, అష్టాచెమ్మా, పచీసు వంటి వాటిని ఆడుకోవచ్చు. అవుట్డోర్ ఆటలను కేవలం తెలిసిన వ్యక్తులతో కలిసి దూరంగా ఉంటూ ఆడుకోవడం చాలా మంచిది.
నచ్చిన పాటలు వినేద్దాం..
సంగీతానికి మించిన ఆనందం లేదు. మంచి సంగీతం లేదా పాటలు వింటే ఎంత ఒత్తిడి ఉన్నా మాయమవుతుంది. ఇంట్లో ఉండి ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా నెట్టింట్లోకి వెళ్లి మంచి పాటలను వినడం వల్ల మానసిక ప్రశాంతత పొందవచ్చు. కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ జరిగి హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు చక్కటి పాటలు వినడం వల్ల కొవిడ్ నుంచి త్వరగా కోలుకుంటారు.
కుటుంబంతో గడపాలి
లాక్డౌన్ సమయంలో రోజుకు 20 గంటలపాటు ఇంట్లోనే ఉండాల్సి రావడంతో కుటుంబానికి చాలా దగ్గరవుతారు. ఉదయం, సాయంత్రం ఇంటి గార్డెనింగ్ పనులు, ఇంటి పనుల్లో సహాయం చేయాలి. పుస్తకాలు చదవడం, పాటలు వినడం, వ్యాయామం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా మరింత దృఢంగా మారుతారు. ప్రస్తుతం దొరికిన సమయంలో ఎక్కువగా కుటుంబంతో గడిపేందుకు వెచ్చించాలి.-డా.విజయభాస్కర్, రవి మీలియోస్ దవాఖాన
ఒత్తిడికి లోను కావొద్దు
లాక్డౌన్ వల్ల ఇంట్లో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించింది. అనవసర విషయాలు చర్చించి ఆందోళనకు లోను కాకుండా ఇండోర్ ఆటలు ఆడటం, పాటలు వినడం, వ్యాయామం చేయడం ఎంతో మేలు. కుటుంబంతో ఆనందంగా గడపడం వల్ల అన్ని బాధలు మరిచిపోతాం. ప్రస్తుత పరిస్థితుల్లో సంతోషమే సగం బలం.డా.రామకృష్ణ, జనరల్ ఫిజీషియన్, వెడలాస్ మెడికల్ విజన్ హెల్త్‌కేర్ సర్వీసెస్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- fitness workouts
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

