మెట్రో విస్తరణకు జెన్-జీ డిమాండ్
సామాజిక, అభివృద్ధి విషయంలో గళమెత్తే జెన్-జీ (జనరేషన్-జడ్) హైదరాబాద్‌లో యాక్టివేటైంది. ప్రపంచ దేశాల్లో ప్రజా సమస్యలపై జెన్-జీ పోరాటాలకు మద్దతు దొరుకుతున్న సమయంలో.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో విస్తరణకు హైదరాబాద్ యువత ఒక్క అడుగు వేసింది.
- నార్త్ సిటీ మెట్రో సాధనలో తొలి అడుగు
- నగర నెటిజన్లతో కలిసి పోరాటానికి సిద్ధం
సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : సామాజిక, అభివృద్ధి విషయంలో గళమెత్తే జెన్-జీ (జనరేషన్-జడ్) హైదరాబాద్‌లో యాక్టివేటైంది. ప్రపంచ దేశాల్లో ప్రజా సమస్యలపై జెన్-జీ పోరాటాలకు మద్దతు దొరుకుతున్న సమయంలో.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో విస్తరణకు హైదరాబాద్ యువత ఒక్క అడుగు వేసింది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా, ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా పదేళ్లలోనే ఎదిగిన హైదరాబాద్.. మెరుగైన రవాణా సదుపాయాలను పొందలేకపోయింది. ఇదే జెన్-జీ యువతను ఆలోచనలో పడేయగా.. నగర నెటిజన్లతో కలిసి పోరాటానికి సిద్ధమైతుంది.
ఐటీ, ఏరో స్పేస్ రంగాల్లో కీలక కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల సమస్యలను ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణలో విఫలమవుతున్న కాంగ్రెస్, బీజేపీలను అడిగేందుకు జెన్-జీ అడుగు వేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ, భావోద్వేగంతో కూడిన లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది. కోటిన్నర జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజల జీవితాలు రోజులో మూడు, నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్‌లోనే పోతుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మెరుగైన రవాణా సదుపాయాలను పొందడం పౌరుల హక్కు అంటూ గళమెత్తింది.
హైదరాబాద్ నగరంలో ప్రయాణ సమయంలో నిత్యం ఎదుర్కొనే ఇబ్బందులను ప్రశ్నిస్తూ..ఓ 25ఏళ్ల యువతి ఆవేదన చెందిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మెట్రో చర్చ మొదలైనప్పుడు తాను పుట్టానని, పాఠశాల, కళాశాల పూర్తి చేసి, ఇప్పుడు ఉద్యోగంలోకి అడుగుపెడుతున్నా.. అయినా మెట్రో విస్తరణ ఎప్పుడూ జరుగుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నా.. అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే డీపీఆర్‌తో మొదలైన మెట్రో విస్తరణ-2 హడావుడితో రోజులు గడిచిపోతున్నాయే తప్పా.. ప్రాజెక్టులో ఎలాంటి కదలిక లేదని అసహనం వ్యక్తం చేసింది. ఒక తరం మొత్తం ఎదురుచూసిన నగరానికి మెట్రో రాదని, ఇంకెంత కాలం ఎదురుచూడాలంటూ ప్రశ్నించింది.
జెన్-జీ మోడ్ యాక్టివేట్..
ప్రపంచ రాజకీయాలపై విస్తృతమైన అవగాహన, సామాజిక, ఆర్థిక, రాజకీయ, మౌలిక, ప్రాంతాల అభివృద్ధిలో నెలకొని ఉన్న అసమానతలపై డిజిటల్ మాధ్యమాల ద్వారా గళమెత్తే వారిలో చురుగ్గా వ్యవహారించే వారు జెన్-జీ వర్గం. నైంటీస్ దశను దాటి, అరచేతిలో ఇమిడిపోయిన సెల్ ఫోన్‌తో రంగప్రవేశం చేసిన జెన్-జీ వర్గం ఇప్పుడు అధునాతన టెక్నాలజీని సైతం అలవోకగా వినియోగించేస్తోంది. తలలు పండిన పరిశోధకుల కృషితో రూపకల్పన చేసిన ఆవిష్కరణలను సులభంగా వాడటంలో అంతకు ముందు తరం వారి కంటే మరింత ముందు వరుసలో ఈ వర్గం ఉండగా.. ఇటీవల ఈ తరహా వర్గం అలికిడి ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వెలుగులోకి వస్తోంది. ఎన్నో దేశాల్లో అంతర్గత సమస్యలను లేవనెత్తే జెన్-జీ కార్యకలాపాలు నగరంలోనూ యాక్టివేట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అత్యంత ప్రభావశీలురుగా గుర్తింపు పొందిన జెన్-జీ మెట్రో విస్తరణ అంశాన్ని ఎత్తుకోవడంపై సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసాన్ని నగరవాసులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానికి లేఖ..జెన్‌జీ పోరాటం
దేశంలోనే అతిపెద్ద జీసీసీ హబ్‌గా, రెండో అతిపెద్ద ఐటీ ఎగుమతి చేసే నగరంగా, ఎయిరోస్పేస్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ఏటా కేంద్రానికి రూ. లక్షకోట్ల పన్నులను అందిస్తోంది. కానీ మౌలిక వసతుల విషయంలో అదే సర్కారును ఆడుక్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా రూ. 45వేల కోట్లతో కాంగ్రెస్ సర్కారు అత్తెసరు డీపీఆర్‌ను, అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్న కేంద్రంలోని బీజేపీని నిలదిస్తోంది. నగరంపై జరుగుతున్న రాజకీయ దోబూచులాటను ప్రశ్నిస్తూ.. జెన్ జీ మేల్కోంది.. హైదరాబాద్ మెట్రోకు సాకులు కాదని, మెట్రో ఫేజ్-2ను ఆమోదించాలంటూ సోషల్ మీడియాలో ప్రధాని మోదీని, కేంద్రంలోని కీలక శాఖల మంత్రులను, రాష్ట్ర సర్కారును డిమాండ్ చేస్తూ.. డిజిటల్ పోరాటం చేస్తోంది.
క్రియాశీలకపాత్రను పోషించేందుకు జెన్-జీ సిద్ధంగా ఉందని, హైదరాబాద్ నగరానికి న్యాయం జరిగే దిశగా పోరాడాల్సిన అవసరాన్ని డిజిటల్ మాధ్యమాల ద్వారా చూపుతుంది. మాకు నిందారోపణలు వద్దూ.. చేతలు మాత్రమే కోరుతున్నామంటూ గట్టిగా జెన్-జీ గళమెత్తుతుంది. అక్కడితో ఆగకుండా, నగరానికి మెట్రో విషయంలో జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాలను నిలదీస్తూ సంతకాల సేకరణ చేస్తోంది. www.change.org/p/sabka-saath-sabka-vikas-start-with-hyderabad-metro-phase-2, లేదా https://c.org/X9mKhBnH8T పేరిట ప్రత్యేక వెబ్ పేజ్‌ను నడుపుతుంది. నగరవాసులను ఉత్సాహంగా పాల్గొనాలనీ, మెట్రో విస్తరణలో జరుగుతున్న జాప్యాన్ని నిలదీసేలా ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను కూడా ఏర్పాటు చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

