హైదరాబాద్ : గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలోని టోలిచౌకీ ఫ్లై ఓవర్ కింద ఓ టీ స్టాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లో మంటలు చెలరేగాయి. టీ స్టాల్ యజమానితో పాటు స్థానికులు అక్కడ్నుంచి పరుగులు తీశారు. ఆ రహదారిపై వెళ్తున్న వాహనదారులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ మంటలు చల్లారలేదు. కాసేపయ్యాక మంటలు చల్లారిపోవడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఇక టోలిచౌకీ ఏరియాలో సిలిండర్లో మంటలు చెలరేగడంతో.. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వాహనాలను అక్కడ నిలపకుండా, ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల చొరవతో.. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.