హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ స్పోర్ట్స్ షాపులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన షాపు సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తోంది. మంటల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను అగ్నిమాపక సిబ్బంది కాపాడింది. భారీ అగ్నికీలలకు దుకాణంలోని వస్తువులన్నీ కాలి బూడిద అయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని షాపు యజమాని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.